KTR on Amit Shah: టీఆర్ఎస్-బీజేపీల ట్విట్టర్ వార్.. కేంద్రం విధానాలపై అమిత్ షాను టార్గెట్ చేసిన కేటీఆర్

|

Apr 10, 2022 | 11:10 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హిందీ లాంగ్వేజ్‌ కామెంట్స్‌కు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు.

KTR on Amit Shah: టీఆర్ఎస్-బీజేపీల ట్విట్టర్ వార్.. కేంద్రం విధానాలపై అమిత్ షాను టార్గెట్ చేసిన కేటీఆర్
Ktr Amit Shah
Follow us on

KTR on Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హిందీ లాంగ్వేజ్‌(Hindi Language) కామెంట్స్‌కు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు(KT Ramarao) స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. అమిత్ షా(Amit Shah)పై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు. ఏం తినాలో, ఏ భాష మాట్లాడాలో ప్రజలకే వదిలేయాలన్నారు. ఇంగ్లీష్‌, రీజనల్‌ లాంగ్వేజ్‌లే కాదు, తప్పకుండా హిందీలో మాట్లాడాలన్న అమిత్‌షా వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. భిన్నత్వంలో ఏకత్వమే ఇండియా బలం, దాన్ని దెబ్బతీయొద్దని సూచించారు. ఇది ‘దేశ భిన్నత్వంపై దాడి’ అంటూ విమర్శించారు కేటీఆర్.

శుక్రవారం షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వరుస ప్రశ్నలు సంధించారు. ఏం తినాలో, ఏం ధరించాలో, ఎవరిని పూజించాలో, ఏ భాష మాట్లాడాలో అన్నీ మీరే నిర్ణయిస్తారా? అంటూ ట్విట్టర్‌ వేదికగా అమిత్‌షాను ప్రశ్నించారు కేటీఆర్. భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్‌ అవుతాయని హెచ్చరించారు. ఏ భాషలో మాట్లాడాలో ప్రజల ఇష్టమన్న కేటీఆర్.. హిందీలోనే మాట్లాడాలంటూ ఆంక్షలు విధిస్తే దేశం నష్టపోతుందన్నారు. నేను మొదట ఇండియన్‌ని, ఆ తర్వాతే తెలుగువాడిని, తెలంగాణ వాడినన్నారు. నా మాతృభాష తెలుగులోనే మాట్లాడతా, అవసరమైనప్పుడు ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూలో మాట్లాడగలనని ట్వీట్‌లో తెలిపారు కేటీఆర్‌. భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్‌ అవుతాయన్నారు.


దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేప్పుడు ఇంగ్లిష్‌, స్థానిక భాషల్లో కాకుండా హిందీలోనే తప్పక మాట్లాడాలని షా అన్నారు. దీనిపై విపక్షాలు తప్పుబడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లిష్‌ భాషను నిషేధించడం వంటివి యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని అభిప్రాయపడుతున్నారు.

Read Also…  Russia Ukraine War: ఉక్రెయిన్‌లో హఠాత్తుగా ప్రత్యక్షమైన బ్రిటన్‌ ప్రధాని.. కీవ్ వీధుల్లో జెలెన్‌స్కీతో కలిసి జాన్సన్‌ అడుగులు