Minister KTR: అధైర్యపడొద్దు..అండగా ఉంటాం.. బాధిత కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా

|

Nov 03, 2021 | 1:18 PM

మహిళలపై కన్నేత్తి చూస్తే కఠినచర్యలు తప్పవని మంత్రి కేటీ.రామారావు హెచ్చరించారు. అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు.

Minister KTR: అధైర్యపడొద్దు..అండగా ఉంటాం.. బాధిత కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా
Minister Ktr
Follow us on

Minister KTR at Nilofar Hospital: మహిళలపై కన్నేత్తి చూస్తే కఠినచర్యలు తప్పవని మంత్రి కేటీ.రామారావు హెచ్చరించారు. అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

దుండుగుల అఘాయిత్యానికి గురై, హైద్రాబాద్ లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన మంత్రి.. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్య సిబ్బందిని ఆరా తీశారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్న మంత్రి.. నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

Read Also…  AP Politics: బద్వేల్‌ ప్రజలు భాజపానే కాదు టీడీపీ, జనసేనలను కూడా ఓడించారు.. ప్రెస్‌ మీట్‌లో ఎంపీ నందిగం సురేష్‌..