Minister Harish Rao: సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయ అధికారులపై మంత్రి హరీష్‌రావు సీరియస్‌

Minister Harish Rao: ఈ మధ్య మంత్రి హరీశ్‌రావును చూస్తే, ఆఫీసర్లు భయపడిపోతున్నారు. మొన్న జనగామ, నిన్న వనపర్తి, తాజాగా, సిద్ధిపేట అధికారులకు చమటలు ప..

Minister Harish Rao: సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయ అధికారులపై మంత్రి హరీష్‌రావు సీరియస్‌
Minister Harish Rao

Updated on: May 29, 2022 | 6:41 AM

Minister Harish Rao: ఈ మధ్య మంత్రి హరీశ్‌రావును చూస్తే, ఆఫీసర్లు భయపడిపోతున్నారు. మొన్న జనగామ, నిన్న వనపర్తి, తాజాగా, సిద్ధిపేట అధికారులకు చమటలు పట్టించారు మంత్రి హరీశ్. సిద్దిపేట మున్సిపల్‌ ఆఫీస్‌ అధికారులపై సిరియస్‌ అయ్యారు మంత్రి హరీశ్‌రావు. సెట్ బ్యాక్ లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై ఆరా తీసిన హరీశ్, అధికారుల తీరు సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు బాగా వసూలు చేస్తున్నారు తప్ప, పనులు చేయడం లేదన్నారు. ఇలాగే చేస్తాం అంటే కుదరదని స్పష్టం చేశారు మంత్రి హరీశ్‌.

సిద్దిపేట మున్సిపల్‌ ఆఫీస్‌లో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్, అందమైన ఆకుపచ్చ, ఆహ్లాదకరమైన సిద్ధిపేట పట్టణం చేద్దామని పిలుపునిచ్చారు. నిధులు ఖర్చు చేయడం కంటే, సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమన్నారు. పట్టణంలో మిగిలిన యూజీడీ కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పన్ను వసూళ్లు చేసి, తాడిపత్రి మున్సిపాలిటీ తరహాలో మిగులు బడ్జెట్ ఉండేలా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్ధిపేట పట్టణ ప్రజల తాగునీటి కోసం ప్రతినెలా 80 లక్షలు కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు వెల్లడించారు మంత్రి హరీశ్‌రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి