Gangula Kamalakar: రైతుల యాసంగి పంటను కేంద్రం కొనాల్సిందే.. లేదంటే ఉద్యమిస్తాంః మంత్రి గంగుల

|

Nov 10, 2021 | 3:12 PM

తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనితీరాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.

Gangula Kamalakar: రైతుల యాసంగి పంటను కేంద్రం కొనాల్సిందే.. లేదంటే ఉద్యమిస్తాంః మంత్రి గంగుల
Gangula
Follow us on

Gangula Kamalakar Union Government: తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనితీరాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కేంద్ర సర్కార్ తీరుకు నిరసనగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకురాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. రైతులు పండించిన యాసంగి పంటను కేంద్రం కొనుగోళ్లు చేయాలన్నారు. రాజ్యాంగ బాధ్యతల నుండి కేంద్రం తప్పించుకోవద్దన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కృషితో 24గంటల కరెంటు, రైతుబందు, రైతు అనుకూల విధానాలతో రైతులు అత్యధిక దిగుబడి సాధిస్తూ.. ఆర్థికంగా వృద్ధి సాధిస్తున్నారన్నారు. రైతులు బాగుపడుతుంటే, కళ్లమంట, కడుపుమంటతో తెలంగాణ రైతుల్ని కేంద్రం అణిచేస్తోందని గంగుల ఆరోపించారు. యాసంగి ఔటర్న్ ఎఫ్.సి.ఐ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక ఉష్ణోగ్రత పరిస్థితుల్లో యాసంగి ధాన్యం విరిగిపోతుందన్న మంత్రి.. బాయిల్డ్ గానే ఔటర్న్ సాధ్యపడుతుందన్నారు. అయితే, రాష్ట్రానికి రాసిన లేఖ ద్వారా యాసంగి పారాబాయిల్డ్ తీసుకోమని కేంద్రం చెప్పిందన్నారు.

బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు యాసంగిలో వరి వేయమని ఎందుకు రైతుల్ని తప్పుదోవపట్టిస్తున్నాడని మండిపడ్డ మంత్రి.. యాసంగి ధాన్యం కొంటామని బీజేపీ నేతలు అధికారికంగా ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అప్పటిదాక రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. రైతులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలు, ఎలక్షన్ కోడ్ పరిధిలోనే నిరసనలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు. కేంద్రం దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.

Read Also…  England vs Pakistan: పాకిస్తాన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఇంగ్లండ్.. టీ20, టెస్టులు ఆడేందుకు అంగీకారం.. ఎప్పుడంటే..!