ఎవరైనా పెళ్లికి వెళ్తే కానుక ఇస్తారు.. లేదంటే క్యాష్ చదివిస్తారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఏకంగా పదవినే ఇచ్చేశారు. అవును.. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరైన కేసీఆర్.. ఆ తర్వాత ఆయనను సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్‌గా అపాయింట్ చేశారు. సీఎం ఆదేశాలివ్వడమే ఆలస్యం.. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ జీవో కూడా జారీ చేశారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్‌గా రవీందర్ సింగ్ రెండేళ్లపాటు కొనసాగనున్నారు. పెళ్లికి వచ్చిన సీఎం కేసీఆర్ రవీందర్ సింగ్‌కు పదవి ఇవ్వడంతో కుటుంబసభ్యులు, ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా మంచి సీఎం అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
కాగా అంతకుముందు కరీంనగర్‌లో జరిగిన రవీందర్ సింగ్ తనయ పెళ్లి వేడుకకు హాజరైన సీఎం.. నవ దంపతులకు ఆశీర్వచనాలు ఇచ్చి.. శుభాకాంక్షలు తెలిపారు. ఆపై రవీందర్ సింగ్ ఫ్యామిలీతో గ్రూప్ ఫోటో దిగారు. అక్కడి నుంచి.. మినిస్టర్ గంగుల కమలాకర్ నివాసానికి వెళ్లారు ముఖ్యమంత్రి. అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత .. టీ తాగి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో TRSను వీడి రెబల్‌గా బరిలోకి దిగారు రవీందర్ సింగ్. కానీ ఓడిపోయారు. అయితే అనూహ్యంగా కేసీఆర్ ఆయన్ను పిలిచి మరీ మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయనకు పార్టీ కార్యక్రమాల్లో ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటులో భాగంగా.. కేసీఆర్ బీహార్ వెళ్తే.. ఆ పర్యటనలో రవీందర్‌సింగ్ ముఖ్యమంత్రి పక్కనే కనిపించారు. తాజాగా ఆయనకు మంచి పదవి కూడా ఇచ్చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..