
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం లండన్ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ టూర్‌లో భాగంగా కేటీఆర్ ఆదివారం అక్కడి బీఆర్ అంబేద్కర్ మ్యూజియంను సందర్శించారు.బారిష్టర్ చదువు కోసం ఇంగ్లాండు వెళ్లిన అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను.. ఈ మ్యూజియంలో పొందుపరిచారు. ఎంతో ఆసక్తితో ఈ మ్యూజియానికి వెళ్లిన కేటీఆర్.. నాడు అంబేద్కర్ నివసించిన గదిని వీక్షించారు. హైదరాబాద్‌లో ప్రతిష్ఠించిన అంబేడ్కర్ విగ్రహ ప్రతిరూపాన్ని అక్కడి మ్యూజియం అధికారులకు, అంబేడ్కర్ చిత్రపటాన్ని ఇండియన్ హైకమిషనర్‌కు కేటీఆర్ బహూకరించారు.
అంబేడ్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నారని ప్రశంసిస్తూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు రాసిన ఓ లేఖను ది ఫెడరేషన్ ఆఫ్ అంబేడ్కరైట్, బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏబీఓ) యూకే అధ్యక్షుడు సంతోష్ దాస్, జాయింట్ సెక్రెటరీ సి.గౌతమ్ కేటీఆర్‌కు అందజేశారు. బాబా సాహెబ్ సహకారాన్ని హైలైట్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అసాధారణ ప్రయత్నాలను ప్రశంసిస్తూ.. మంత్రి కేటీఆర్‌ను సత్కరించారు. విలియం గౌల్డ్, క్రిస్టోఫ్ జాఫ్రెలాట్‌లతో కలిసి రచించిన “అంబేద్కర్ ఇన్ లండన్” పుస్తకం సంతకం కాపీని మంత్రి కేటీఆర్‌కు అందించారు. హుస్సేన్ సాగర్ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణకే కాకుండా భారతదేశానికి గర్వకారణమని, కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం హర్షణీయమని వారు లేఖలో పేర్కొన్నారు. అలాగే ఎఫ్‌ఏబీఓ ప్రతినిధులు రాసిన అంబేడ్కర్ ఇన్ లండన్ అనే పుస్తకాన్ని కేటీఆర్‌కు అందజేసి ఆయనను సత్కరించారు.
IT and Industries Minister @KTRBRS pays tribute to Dr. Ambedkar’s legacy during UK tour!
✳️ Minister KTR visited Ambedkar Museum in London and paid his respects to Dr. B.R. Ambedkar, the architect of the Indian Constitution and a champion of social justice.
✳️ The museum… pic.twitter.com/ufEm7tIRCX
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 14, 2023
ఇదిలా ఉంటే లండన్ పర్యటలో ఉన్న కేటీఆర్ ఓ అరుదైన ఫొటోను షేర్ చేశారు. 22 ఏళ్ల క్రితం పైచదువుల నిమిత్తం లండన్‌కు వెళ్లిన సమయంలో దిగిన ఫొటోను కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ సమయంలో లండన్‌లో ఓ ఫోన్ బూత్ వద్ద దిగిన ఫొటోను నెటిజన్లతో పంచుకున్నారు. ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘లండన్ లో 22ఏళ్ల క్రితం’.. ప్రస్తుతం నా లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి వస్తుండగా.. నా జ్ఞాపకాలను నెమరవేసుకున్నాను అనే క్యాప్షన్ రాసుకొచ్చారు.
In London, 22 years back
Reminiscing as I return back home pic.twitter.com/XeejM8k8SA
— KTR (@KTRBRS) May 14, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..