KTR: నేటి నుంచి దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు.. పాల్గొననున్న కేటీఆర్‌ టీమ్‌.

స్విట్జర్లాండ్‌లోనే దావోస్‌లో నేటి (సోమవారం) నుంచి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు ప్రారంభంకానుంది. ఈ సదస్సులో పాల్గొనడానికి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదివారం దావోస్‌ చేరుకున్నారు. ఈ నెల16 నుంచి 20 వరకు జరుగనున్న ఈ సదస్సులో...

KTR: నేటి నుంచి దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు.. పాల్గొననున్న కేటీఆర్‌ టీమ్‌.
Ktr Davos Tour

Updated on: Jan 16, 2023 | 7:18 AM

స్విట్జర్లాండ్‌లోనే దావోస్‌లో నేటి (సోమవారం) నుంచి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు ప్రారంభంకానుంది. ఈ సదస్సులో పాల్గొనడానికి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదివారం దావోస్‌ చేరుకున్నారు. ఈ నెల16 నుంచి 20 వరకు జరుగనున్న ఈ సదస్సులో కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం పాల్గొననుంది. ఇందులో భాగంగా పెవిలియన్‌లో పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం అవుతారు. డబ్ల్యూఈఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇండస్ట్రీ రౌండ్‌టేబుల్స్‌లో కూడా కేటీఆర్ పాల్గొంటారు.

రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి సంస్థలకు పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించడం, ప్రైవేట్ రంగంలో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల, పరిశ్రమ అనుకూల విధానాలను హైలైట్ చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించనున్నారు. తెలంగాణను అగ్రగామి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చడంలో మీ నాయకత్వం ఎంతో కీలకమైందంటూ కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో డబ్ల్యూఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ బోర్గే బ్రెండే కొనియాడారు. ఇదిలా ఉంటే దావోస్‌కు తెలంగాణ ప్రతినిధుల బృందాన్ని పంపడం ఇది ఐదవసారి.

2018లో తొలిసారిగా తెలంగాణ నుంచి దావోస్‌కు ప్రతినిధులు వెళ్లగా 2019, 2020, 2022లోనూ హాజరయ్యారు. ‘కో ఆపరేషన్‌ ఇన్‌ ఫ్రాగ్మెంటెడ్‌ వరల్డ్‌’ నినాదంతో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఆల్‌పైన్‌ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 1,500 మీటర్ల ఎత్తున ఉన్న విడిది పట్టణం దావోస్‌లో ప్రతీ ఏటా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడం ద్వారా ప్రైవేటు రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా కేటీఆర్‌ ప్రసంగాలు, భేటీలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..