ABVP Protest: ఇంటర్ బోర్డును ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు.. ఫెయిలైన విద్యార్థులను పాస్ చేయాలని డిమాండ్!

|

Dec 18, 2021 | 1:11 PM

కరోనా సమయంలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఇంటర్ విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంటర్ బోర్డు వైఫల్యం కారణంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం భాధ్యతవహించాలన్నారు.

ABVP Protest: ఇంటర్ బోర్డును ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు.. ఫెయిలైన విద్యార్థులను పాస్ చేయాలని డిమాండ్!
Abvp
Follow us on

ABVP Protest on Inter Results: తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అన్యాయం జరిగిందని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆరోపించింది. ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను నిరసిస్తూ ఏబీవీపీ ఆందోళన చేపట్టి, ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో.. ఏబీవీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపు లాట చోటుచేసుకుంది. అనంతరం ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నాంపల్లి, బేగంబజార్, ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.

కాగా, కరోనా సమయంలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఇంటర్ విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంటర్ బోర్డు వైఫల్యం కారణంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం భాధ్యతవహించాలన్నారు. వెంటనే ఉచితంగా రీ వాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యాకర్తలు ఈరోజు ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మరోవైపు, విద్యార్థులను తరలించడం, అరెస్ట్ చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది.

అయితే, ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ పిలుపునివ్వడంతో.. ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు, ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరుగలేదని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ బోర్డు సెకరెట్రి ఒమర్ జలీల్ మాట్లాడుతూ…70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించామన్నారు. విద్యార్థులకు వారి ఫలితాలపై డౌట్స్ ఉంటే రి వెరిఫికేషన్‌కు అప్లే చేసుకోవచ్చని తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు 2022 ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ పేర్కొన్నారు.
కరోనా కారణంగా నేరుగా తరగతులు నిర్వహించకపోవడం.. తొలుత పరీక్షలను రద్దు చేసిన సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేయడం.. ఆ తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించడం వంటి పరిస్థితుల్లో విద్యార్థులు గందరగోళానికి లోనయ్యారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు, ఇలాంటి వార్తల నేపథ్యంలోనే తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. గత పరీక్షల్లో ఫెయిల్‌ వారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఏప్రిల్‌ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయోచ్చని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని జలీల్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఏమైనా అనుమానాలుంటే ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందవచ్చని చెప్పారు. కాగా, ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. దీంతో తాజాగా ఇంటర్ బోర్డ్‌ తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు ఊరటనిచ్చింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 11 శాతం ఉత్తీర్ణత తగ్గడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మొత్తం జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు.

Read Also… Collectors conference: జిల్లా కలెక్టర్లతో సీఎం విస్తృతస్థాయి సమావేశం.. ఇవాళ దళిత బంధు పథకంపై కేసీఆర్ కీలక ప్రకటన