Eectricity Charges Hike: ఐదు సంవత్సరాల తర్వాత తెలంగాణ (Telangana)లో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌పై రూపాయి పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1 (April 1st) నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు వ్యవసాయానికి ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. 200 యూనిట్లలోపు వినియోగించే హెయిర్ కట్టింగ్ సెలూన్లు, నివాస గృహాలకు 1ఏ కేటగిరీలో 50 యూనిట్ల వరకు యూనిట్ ఛార్జీ రూ.1.40 పైసల నుంచి రూ.1.95 పైసలకు పెరగనుంది. అదే విభాగంలో 50 యూనిట్లు మించి కరెంట్ వాడేవారికి 100 యూనిట్ల వరకు యూనిట్ రూ.2.60 పైసలుగా ఉన్న ఛార్జీ.. రూ.3.10 పైసలకు చేరనుంది.
ఇక ఇళ్లకు ఎల్‌టీ-1 బీ1 కేటగిరీలో వంద యూనిట్ల వరకు యూనిట్ ఛార్జీ రూ.3.30 పైసల నుంచి.. రూ.3.40 పైసలకు మాత్రమే పెరిగింది. 101 నుంచి 200 యూనిట్ల వరకు.. యూనిట్ ధర రూ. 4.30 పైసల నుంచి రూ.4.80 పైసలకు పెరిగింది. ఎల్‌టీ-1 బీ2లో 200 యూనిట్ల వరకు రూ. 5గా ఉన్న యూనిట్ ఛార్జీ.. రూ. 5.10 పైసలకు చేరింది. 201 నుంచి 300 వరకు రూ.7.20 పైసల నుంచి రూ.7.70 పైసలకు ఎగబాకింది. 301 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ.8.50 పైసల నుంచి రూ.9లకు ఎగబాకింది. 401 నుంచి 800 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.9 గా ఉన్న ఛార్జీని రూ.9.50 పైసలకు పెంచారు.
వాణిజ్య సముదాయాలకు..
వాణిజ్య సముదాయాలకు ఎల్‌టీ-2ఏలో 50 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.6 ఉన్న ఛార్జీ.. ఇప్పుడు రూ.7లకు చేరింది. వాణిజ్య సముదాయాలకు ఎల్‌టీ-2బీలో 100 యూనిట్ల వరకు రూ.7. 50పైసలున్న యూనిట్ ఛార్జీని రూ.8 పెంచారు. ఇక 101 నుంచి 300 యూనిట్ల వరకు.. రూ. 8.90 పైసల నుంచి రూ.9.90కు పెరిగింది. 301 నుంచి 500యూనిట్ల వరకు యూనిట్ ధర రూ.9.40 పైసల నుంచి రూ.10. 40 పైసలకు పెరిగింది.
ఇవి కూడా చదవండి: