Telangana High Court: రంజాన్ తరువాత లాక్‌డౌన్ పెడతారా..? తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Telangana High Court on KCR govt: కరోనా వ్యాప్తి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంటర్ స్టేట్

Telangana High Court: రంజాన్ తరువాత లాక్‌డౌన్ పెడతారా..? తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
Telangana High Court

Updated on: May 11, 2021 | 12:50 PM

Telangana High Court: కరోనా వ్యాప్తి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంటర్ స్టేట్ బార్డర్స్ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను ఎందుకు అవుతున్నారంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్టాల నుంచి ఆంబులెన్స్‌లో వస్తున్న వారికి టెస్టులు చేయమని మాత్రమే చెప్పామని.. వారిని ఆపమని మీకు ఎవరు చెప్పారంటూ ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అంబులెన్సుల్లో వచ్చిన కరోనా రోగులను తెలంగాణ సరిహద్దుల్లోనే అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇతర వాహనాలను, ఇతర రోగులను తీసుకెళ్తున్న అంబులెన్సులను అనుమతిస్తున్నా.. కరోనా రోగులతో వచ్చే అంబులెన్సులను మాత్రం వెనక్కి పంపుతున్నారు. దీంతో సరిహద్దుల్లో పెద్ద ఎత్తున అంబులెన్సులు నిలిచిపోతున్నాయి. అయితే తెలంగాణలో కోవిడ్ అంశంపై మంగళవారం విచారించిన హైకోర్టు.. ఈ సమయంలో అంబులెన్స్ లు ఆపడం మానవత్వమా..? అంటూ ప్రశ్నించింది.

రాష్ట్రంలో అంబులెన్స్ ధరలను నియంత్రించాలని చెప్పాం ఎంత వరకు చేశారని ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. రాష్ట్రం లో జరుగుతున్న వాటికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలంది. కుంభ మేళా నుంచి తిరిగి వచ్చిన వారిని గుర్తించి టెస్ట్ లు చేయాలని చెప్పాం.. చేశారా..? అని హైకోర్టు ప్రశ్నించింది. పాతబస్తీ వంటి ప్రాంతాల్లో మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించడం లేదని హైకోర్టు నిలదీసింది. హైదరాబాద్, రంగారెడ్డిలలో కేసులు తగ్గాయని ఎలా చెపుతున్నారని ప్రశ్నించింది. టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెపుతారంటూ మండిపడింది. రంజాన్ తరువాత లాక్ డౌన్ పెడతారా..? ఈ లోపే వైరస్ విజృంభిస్తోంది కదా అంటూ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మేం ఆదేశాలు ఇచ్చిన రోజు హుటాహుటిన ప్రెస్ మీట్ లు పెట్టి పరిష్టితి అంతా బాగుంది లాక్‌డౌన్ లేదని… ఎలా చెబుతారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కరోనా యాక్టివ్ కేసులు ఎందుకు తగ్గుతున్నాయని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టెస్ట్ ల సంఖ్య పెంచాలని తాము చెబితే అందుకు బిన్నంగా తగ్గించారు. హైకోర్టు అంటే మీ ప్రభుత్వానికి లెక్క లేదా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read:

Telangana lockdown: తెలంగాణలో లాక్‌డౌన్..? సీఎం కేసీఆర్ నిర్ణయం అదేనా.. మరికాసేపట్లో కేబినేట్ భేటీ

India Coronavirus: కరోనా సెకండ్ వేవ్.. నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే..?