Harish Rao: తెలంగాణలో ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రకంపనలు.. హైకోర్టు ఆదేశాలపై స్పందించిన మంత్రి హరీష్‌ రావు

ఒమిక్రాన్‌ కట్టడికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు. హైకోర్టు ఆర్డర్‌ ఇంకా అందలేదని, అందిన వెంటనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

Harish Rao: తెలంగాణలో ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రకంపనలు.. హైకోర్టు ఆదేశాలపై స్పందించిన మంత్రి హరీష్‌ రావు
Harishrao

Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 7:17 PM

Harishrao reacts on High Court Orders: ఒమిక్రాన్‌ కట్టడికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు. హైకోర్టు ఆర్డర్‌ ఇంకా అందలేదని, అందిన వెంటనే నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌ దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌, ఐసీయూ వార్డును మంత్రి హరీష్ ప్రారంభించారు. అలాగే, కరోనా నియంత్రణలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. అయితే, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌, చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌పై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదని హరీశ్ రావు తెలిపారు. ఇక, నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు ప్రతినెలా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా, ఒమిక్రాన్‌ వ్యాప్తి కట్టడికి పండగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. గురువారం కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోందని.. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కరోనా నిబంధనలు కఠినతరం చేసిందని గుర్తి చేసింది కోర్టు. మహారాష్ట్ర, ఢిల్లీ తరహాలోనే ఆంక్షలు పెట్టాలని.. జనాలు గుంపులుగా ఉండకుండా చూడాలని హైకోర్టు సూచించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒమిక్రాన్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచింది తెలంగాణ హైకోర్టు.

Read Also….UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ర్యాలీలో అపశృతి.. కూప్పకూలిన కిసాన్ దివస్ వేదిక..!