Telangana Cabinet: తెలంగాణలో కొత్త ఫించన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగష్టు 15వ తేదీ నుంచి కొత్తగా 10 లక్షల ఆసరా ఫించన్లు మంజూరుకు కేబినేట్ ఆమోదించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో మొత్తం 46 లకల మంది ఫించను కార్డులను ప్రభుత్వం జారీచేయనుంది. కొత్త వారికి కూడా సెప్టెంబరు నుంచి ఫించను వచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో తెలంగాణలో ఫించన్ల కోసం ప్రజలు ధరఖాస్తు చేసి.. ఎప్పుడు మంజూరవుతాయా అని ఎదురుచూస్తున్నవారికి కేబినేట్ తాజా నిర్ణయంతో ఉపశమనం లభించినట్లైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..