Telangana: గర్భిణీలకు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుక.. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ.. ఏముంటాయంటే..

|

Aug 14, 2022 | 4:57 PM

Telangana: మహిళ, శిశు సంక్షేమానికి పెద్ద పీట వేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలవరీల సంఖ్య పెరుగుతోంది...

Telangana: గర్భిణీలకు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుక.. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ.. ఏముంటాయంటే..
Follow us on

Telangana: మహిళ, శిశు సంక్షేమానికి పెద్ద పీట వేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలవరీల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా గర్భిణీల కోసం మరో కొత్త కిట్‌ను ప్రవేశపెట్టనుంది. గర్భిణీ మహిళల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ‘కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌’ను అందించనున్నారు. బతుకమ్మ కానుకగా ఈ కిట్‌ను అందించనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు శనివారం తెలిపారు. ఈ పథకాన్ని మొదట తెలంగాణలోని 9 జిల్లాల్లో వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నారు.

కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను మొదట ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌ కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో అందించనున్నారు. మొత్తం 1.50 లక్షల మంది లబ్ధిదారులకు ఈ కిట్లు అందించనున్నారు. కిట్‌ విలువ రూ. 2 వేలుగా ఉండనుంది. ఈ న్యూట్రిషియన్‌ కిట్స్‌లో న్యూట్రిషన్‌ మిక్స్‌డ్‌ పౌడర్‌ (హార్లిక్స్‌) 2 బాటిళ్లు (ఒక్కొక్కటి కిలో చొప్పున), ఖర్జూర ఒక కిలో.. నెయ్యి 500 గ్రాములు, ఐరన్‌ సిరప్‌ 3 బాటిళ్లు, ఆల్బెండజోల్‌ ట్యాబ్లెట్లు ఒక కప్పు ఇవ్వనున్నారు.

ఈ విషయమై మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. ‘ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజల వణాలతో కూడిన న్యూట్రిషన్‌ కిట్‌ విలువ రూ.2వేలు ఉంటుంది. గర్భిణీలకు 3వ నెలలో, 6వ నెలలో ఈ కిట్‌ను అందించారు. ఈ న్యూట్రీషన్‌ కిట్‌తో పోషకాహార లోపం తగ్గడంతో పాటు, సిజేరియన్లు తగ్గుతాయని, మాతాశిశు మరణాలను నియంత్రించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ‘బిడ్డ కడుపులో ఉన్నప్పుడు న్యూట్రిషన్‌ కిట్‌.. బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్‌ కిట్‌’ అందిస్తూ అండగా నిలుస్తోంది’ అని మంత్రి చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..