
ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం, కాలేజీ యాజమాన్యాలు పదే పదే ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో సమూల సంస్కరణలు తీసుకురావడంపై అధ్యయనం చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గత కొంతకాలంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. దీనివల్ల ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతోంది. సమయానికి నగదు అందకపోవడంతో యాజమాన్యాలు తరచుగా బంద్‌లకు పిలుపునిస్తున్నాయి. చర్చల తర్వాత ప్రభుత్వం వాయిదాల రూపంలో చెల్లింపులు చేస్తున్నప్పటికీ, ఈ జాప్యం పునరావృతమవుతోంది. ఈ తరహా ఘటనలు విద్యార్థులపై, విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కమిటీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీతో సహా మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు. ప్రముఖ ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరాంలకు ఈ కమిటీలో చోటు కల్పించారు.కాలేజీ యాజమాన్యాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడానికి వారి నుంచి ముగ్గురు ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించారు.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో కమిటీకి నిర్దిష్టంగా ఈ లక్ష్యాలను అప్పగించింది..
ఈ కమిటీ తన సమగ్ర నివేదికను మూడు నెలల్లోపు ప్రభుత్వానికి అందజేయాలని జీవోలో స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో ఒక శాశ్వత విధానాన్ని రూపొందించే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.