Telangana: 24 గంటలూ షాపులు తెరిచేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మరి మద్యం దుకాణాలు..?

|

Apr 10, 2023 | 9:35 AM

జీవో నం.4 కింద ఇచ్చిన 24 గంటలు దుకాణాలు తెరిచే నిబంధన అన్ని దుకాణాలకు ఆటోమేటిక్‌గా వర్తించదు. ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌శాఖకు అస్సలు వర్తించదు. తాజా ఉత్తర్వలుకు సంబంధించి రాష్ట్ర కార్మికశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని క్లారిటీ ఇచ్చారు.

Telangana: 24 గంటలూ షాపులు తెరిచేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మరి మద్యం దుకాణాలు..?
Liquor Shop
Follow us on

రాష్ట్రంలో 24 గంటలూ దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తూ ఇటీవల తెలంగాణ సర్కార్ ఉత్తర్వలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన నియమ, నిబంధనలు.. విధి విధానాలపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. తాజాగా ఈ అంశాలపై రాష్ట్ర కార్మిక శాఖ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం -1988 పరిధికి లోబడి ఈ ఉత్తర్వులు అమలవుతాయని తెలిపింది. 4 .4 .2023న జారీ చేసిన జీవో నం.4  ఉత్తర్వులు అన్ని షాపులకు ఆటోమేటిక్‌గా వర్తించదని క్లారిటీ ఇచ్చారు.  24 /7 గంటలు తెరిచి ఉంచాలనుకునే షాపులు ప్రత్యేక నిబంధనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తగు అనుమతులు పొందాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైన న్యూ ఢిల్లీ, ముంబై , బెంగుళూరులలో 24 / 7 గంటలు షాపులు తెరిచి ఉంచే నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిపారు.

జీవో నం.4 ఉత్తర్వులు ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌శాఖకు వర్తించదని స్పష్టంచేశారు. ఎక్సైజ్‌ చట్టాలు, నిబంధనల ప్రకారం టీఎస్‌బీసీఎల్‌, ఐఎంఎఫ్‌ఎల్‌ డిపోలు, డిస్టిలరీలు, బ్రివరీలు, ఏ4 షాపులు, 2బీ బార్లు ప్రత్యేక సమయం ప్రకారం తెరిచి ఉంటాయన్నారు. సో క్లారిటీ వచ్చింది కదా.. మద్యం దుకాణాలకు ప్రస్తుత సమయమే కొనసాగుతుంది. తాజా ఉత్తర్వులు లిక్కర్ షాపులకు వర్తించవు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..