Telangana Governor: ప్రధాని మోదీకి ఇచ్చిన పుస్తకంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆసక్తికర విషయాలు

కొవిడ్‌ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసిందని గవర్నర్‌ తమిళి సై అన్నారు. వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్‌, ఎప్పటికప్పుడు రాష్ట్రాలను మానిటరింగ్‌ చేయడంలో కేంద్ర ప్రభుత్వ యంత్రాగం అలెర్ట్‌గా ఉందన్నారు.

Telangana Governor: ప్రధాని మోదీకి ఇచ్చిన పుస్తకంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆసక్తికర విషయాలు
Telangana Governor

Updated on: Aug 12, 2021 | 9:35 PM

Tamilisai Soundararajan: కొవిడ్‌ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసిందని గవర్నర్‌ తమిళి సై అన్నారు. వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్‌, ఎప్పటికప్పుడు రాష్ట్రాలను మానిటరింగ్‌ చేయడంలో కేంద్ర ప్రభుత్వ యంత్రాగం అలెర్ట్‌గా ఉందన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై తాను రాసిన ఫ్రైమ్‌ మినిస్టర్‌ టు పాండమిక్‌ మేనేజ్‌మెంట్‌ పుస్తకాన్ని రిలీజ్‌ చేశారు. వాటిలో తానూ ప్రత్యక్షంగా చూసిన అనుభవాలను పొందుపరిచారు.

ఈ పుస్తకాన్ని ప్రధాని మోదీకి ఇచ్చినట్లు గవర్నర్ తెలిపారు. గవర్నర్‌గా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్‌లో తానూ డైరెక్ట్‌గా ఇన్వాల్‌ కాలేదని.. పుదుచ్చేరిలో మాత్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ప్రత్యక్షంగా కేంద్రం పనితీరు చూశానన్నారు. పీఎం టు పీఎం బుక్‌లో తాను రాసిన వివరాలు ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పారు గవర్నర్‌ తమిళిసై.

కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రధాని నరేంద్రమోదీతో పాటు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రహోం మంత్రి అమిత్ షాను కూడా కూాడా కలిశారు.

Telangana Governor Book