Telangana: తెలంగాణను ఎలా హ్యాండిల్‌ చేయాలో నాకు బాగా తెలుసు: గవర్నర్ తమిళిసై

|

Feb 03, 2023 | 9:55 AM

తెలంగాణను ఎలా హ్యాండిల్‌ చేయాలో తనకు తెలుసన్నారు గవర్నర్‌ తమిళిసై. గైనకాలజిస్ట్‌ అయినా తనకు చిన్న బేబీని ఎలా కేర్‌ తీసుకుంటామో.. అలా తెలంగాణను

Telangana: తెలంగాణను ఎలా హ్యాండిల్‌ చేయాలో నాకు బాగా తెలుసు: గవర్నర్ తమిళిసై
Governor Tamilisai
Follow us on

తెలంగాణను ఎలా హ్యాండిల్‌ చేయాలో తనకు తెలుసన్నారు గవర్నర్‌ తమిళిసై. గైనకాలజిస్ట్‌ అయినా తనకు చిన్న బేబీని ఎలా కేర్‌ తీసుకుంటామో.. అలా తెలంగాణను కూడా అలాగే కేర్‌ చేస్తానన్నారు ఆమె. తెలంగాణలో రాజ్‌భవన్‌-ప్రగతిభవన్‌ మధ్య గ్యాప్‌ మరింత పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమితిసై చేసిన తాజాగా కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తాజాగా సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహిచంగా.. గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘పుదుచ్చేరి ఇంఛార్జి గవర్నర్‌గా వెళ్లిన కొత్తలో తనను అంతా మహిళా గవర్నర్‌ అని, ప్రాబ్లమ్స్‌ ఎలా హ్యాండిల్‌ చేస్తారు..? అనే కామెంట్స్‌ వినిపించాయి. అయితే పుదుచ్చేరిని ఎలా హ్యాండిల్‌ చేశానో అందరూ చూశారు. నా వృత్తే గైనకాలజిస్ట్‌.. తెలంగాణ న్యూ బర్న్‌ బేబీ లాంటిది. చిన్న చిన్న బేబీలను ఎలా కేర్‌ చేస్తామో..తెలంగాణను కూడా అలాగే కేర్‌ చేస్తాను. తెలంగాణను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు.’ అని పేర్కొన్నారు గవర్నర్‌ తమిళసై.

రాజ్‌భవన్ కమ్యూనిటీహాల్‌లో గాంధీ మెడికల్‌కాలేజ్‌కు చెందిన వైద్యులతో సీపీఆర్‌పై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సీపీఆర్ నేర్చుకోవాలని గవర్నర్ తమిళి సై సూచించారు. సామాన్య ప్రజలకు సీపీఆర్ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. సీపీఆర్ లైఫ్ సేవింగ్ ప్రోగ్రాం అని.. టీవీల్లో చూసైనా నేర్చుకోవాలన్నారు. సీపీఆర్ తెలియక ఎంతో మంది హర్ట్ స్ట్రోక్ తో చనిపోతున్నారన్నారు. రెండు,మూడుసార్లు ట్రైన్, ఫ్లైట్‌లో వెళ్లేటప్పుడు తన ముందే హార్ట్‌స్ట్రోక్ వస్తే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడానని చెప్పారు గవర్నర్‌ తమిళిసై.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..