Telangana: యువతకు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

| Edited By: Ram Naramaneni

Jun 18, 2024 | 5:06 PM

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా మార్చాలని డిసైడ్ అయింది. ఇందుకోసం టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది.

Telangana: యువతకు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
Revanth Reddy
Follow us on

ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ.. టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు భూమిపూజ చేశారు సీఎం రేవంత్‌.

ఏటీసీలలో అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటు చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చేందుకు 130మంది నిపుణులను టీటీఎల్ నియమిస్తుంది. ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు రకాల లాంగ్ టర్మ్ కోర్సుల్లో 31,200 మందికి 23 రకాల షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. గత పదేళ్లలో రాష్ట్రంలోని ఐటీఐలలో కేవలం లక్షన్నర మంది మాత్రమే శిక్షణ పొందారు. ఈ ఏటీసీలతో రానున్న పదేళ్లలో 4లక్షల మందికి శిక్షణ అందించనున్నారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చే ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం 2,324.21 కోట్లు. ఏటీసీలు కేవలం వేర్వేరు కోర్సుల్లో శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పనిచేయనున్నాయి.

ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికతేవేత్తలతో పాటు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలకు టెక్నాలజీ హబ్‌గా పనిచేస్తాయి. ఏటీసీల్లో వేర్వేరు కోర్సుల్లో శిక్షణ పొందిన వాళ్లకి టీటీఎల్‌ ఉద్యోగా అవకాశాలు కల్పించనుంది. అలాగే ఏటీసీలు భ‌విష్యత్తులో త‌మ సేవ‌ల‌ను పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు కూడా అందజేయనున్నాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..