
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల రైతుల కోసం యూరియా యాప్‌ను రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ యాప్ ద్వారా రైతులు ఎక్కడనుంచైనా తమ పంటకు కావాల్సిన యూరియాను మొబైల్ నుంచే బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. దీని వల్ల షాపుల ముందు గంటల కొద్ది క్యూలైన్‌లో నిల్చోవాల్సిన అవసరం రైతులకు తప్పింది. దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు యూరియా అక్రమ సరఫరాను అడ్డుకోవచ్చు. ప్రస్తుతం ఐదు జిల్లాల్లో ఈ యాప్ సేవలను ప్రారంభించగా.. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రైతుల కోసం సర్కార్ మరో యాప్ రూపొందించింది. ఈ యాప్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుక త్వరలో కొత్త యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం తీసుకురానుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉండగా.. త్వరలోనే లాంచ్ చేయనున్నారు. ఈ యాప్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు రాయితీలు కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు ఆదాయం పెరిగేలా చేయనున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం గురించి మెళుకువులు తెలియజేస్తారు. అలాగే ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి రైతుల వివరాలన్నీ యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఏ రైతు ఎంత పంట పడిస్తున్నాడు.. ఏ పంట పండిస్తున్నాడు.. ఎక్కడ సాగు చేస్తున్నాడు.. ఉత్పత్తులు ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాయి అనే వివరాలు యాప్‌లో ఉంటాయి. ఇక రైతుల అడ్రస్, మొబైల్ నెంబర్లు, ఫొటోలు, వీడియోలు కూడా ఉంచుతారు. ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా రైతులను సంప్రదించవచ్చు.
ఇక ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన వివరాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇటీవల మార్కెట్లో నకిలీ ఆర్గానిక్ ఉత్పత్తులు చలామణి అవుతున్నాయి. ఏడి నిజమైన ప్రొడక్ట్.. ఏది నికిలీ ప్రొడక్ట్ అనేది తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రజలు ఈ యాప్ ద్వారా నిజమైన ప్రొడక్ట్స్‌ను కొనుక్కోవచ్చు. ఇలా రైతులతో పాటు ప్రజలకు కూడా ఈ యాప్ ఉపయోగపడనుంది. మరోవైపు నకిలీ ఉత్పత్తులను అడ్డుకోవడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌కు లేబులింగ్ సిస్టమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ లేబుల్ విధానం ద్వారా ఖచ్చితమైన ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయవచ్చు. ఇక ఆర్గానిక్ ఉత్పత్తుల లేబుల్ కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ ప్రాధికార సంస్థ దగ్గర దరఖాస్తు చేసుకోవాలి. అయితే రైతులు