
హైదరాబాద్‌లోని కోకాపేటలో మరికొన్ని ప్లాట్లను అమ్మేందుకు సర్కాన్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మరో 45 ఎకరాల్లో 7 ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయానికి వేలం వేయనుంది. ఎకరానికి కనీస ధర రూ.35 కోట్ల వరకు నిర్ణయించింది ప్రభుత్వం. అయితే కోకాపేట భూములకూ గతంలో భారీగా రికార్డు స్థాయి ధర పలుకగా, కనీస ధరకు పోయినా దాదాపు రూ.1,600 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా.
డిమాండ్ ఎక్కువ ఉండటంతో 2,500 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈనెల 20వ తేదీన ప్రీబిడ్ సమావేశం జరగనుంది. రిజిస్ట్రేషన్‌కు నెలాఖరు వరకు అవకాశం ఉంది. ఆగస్టు 3న ‘ఈ- వేలం’ ద్వారా భూములను విక్రయం కొనసాగనుంది.
Attention – builders / developers @HMDA_Gov auctions 7 plots ranging from 3.6 -9.1 acres totalling 45.33 acres at Neopolis @Kokapet – the most prestigious address!
The best in class infrastructure ensures it’s the place to own
Auction on Aug 3@KTRBRS pic.twitter.com/3RoTjN45w8
— Arvind Kumar (@arvindkumar_ias) July 7, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి