Warangal Hospital: వరంగల్‌లో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. రూ. 1,100 కోట్లు విడుదల..

|

Dec 05, 2021 | 6:24 AM

Warangal Hospital: వరంగల్‌లో భారీ నిర్మాణం జరగనుంది. అందుకు 11 వందల కోట్లు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏంటా నిర్మాణం? అన్ని నిధులు ఎందుకు మంజూరు చేసింది

Warangal Hospital: వరంగల్‌లో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. రూ. 1,100 కోట్లు విడుదల..
Telangana Govt
Follow us on

Warangal Hospital: వరంగల్‌లో భారీ నిర్మాణం జరగనుంది. అందుకు 11 వందల కోట్లు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏంటా నిర్మాణం? అన్ని నిధులు ఎందుకు మంజూరు చేసింది సర్కార్‌? ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత పెద్ద నగరం వరంగల్. ఈ నగర అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు. తాజాగా వరంగల్‌ చరిత్రలోనే భారీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వరంగల్ హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా అక్కడి కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి రూ. 1,100 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. ఇందులో సివిల్ పనులకు రూ. 509 కోట్లు, మంచినీరు, పారిశుద్ధ్యం కోసం రూ. 20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ. 105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ. 54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ. 229.18 కోట్ల నిధుల కోసం అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం.

ఈ పనులను వెంటనే Tsmsidc, dme ఆధ్వర్యంలో చేపట్టాలని అదేశించారు ఉన్నతాధికారులు. కొద్ది రోజుల క్రితమే వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. దానికి సంబంధించి ప్రకటన చేయడమే ఆలస్యం.. జైలును యుద్దప్రాతిపదికన ఖాళీ చేయించారు అధికారులు. సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలను ఇతర ప్రాంతాల్లో ఉన్న సబ్ జైలుకు తరలించారు. జైలు ఖాళీ అయిన తర్వాత ఇటివల సీఎం కేసీఆర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. త్వరితగతిన ఆసుపత్రిని నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం. 2 వేల పడకల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ హాస్పిటల్‌లో 36 విభాగాలు పని చేస్తాయి. సుమారు 500 మంది వైద్యులు, వెయ్యి మందికిపైగా నర్సులు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు ఇతర సిబ్బంది పని చేయనున్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తై అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ బాట పట్టే కష్టాలకు తెరపడనుంది. ఇప్పటికే వరంగల్‌లో ఉన్న ఎంజీఎం ఆసుపత్రిని పూర్తిస్థాయి మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిగా మార్చనున్నారు అధికారులు.

Also read:

Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం