Dalit Bandhu: దళిత బంధు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం..

|

Sep 15, 2021 | 2:11 AM

Dalitha Bandhu scheme: తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొదటగా ప్రభుత్వం.. హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా

Dalit Bandhu: దళిత బంధు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం..
Telangana Government
Follow us on

Dalitha Bandhu scheme: తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొదటగా ప్రభుత్వం.. హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులకు తీపి కబురు అందించింది. 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం మంగళవారం నిధులు జమచేసినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు వలస వెళ్లిన కుటుంబాల గురించి అధికారులు రీ సర్వే చేస్తున్నారు. వారి జాబితా కూడా సిద్ధం చేసి త్వరలోనే వారికి కూడా దళిత బంధు పథకం నిధులు మంజూరు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటికే మూడు విడతల్లో దళిత బంధు నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మూడు విడతల్లో కలిపి మొత్తంగా రూ.1,200 కోట్లను లబ్ధిదారులకు అందజేసినట్లు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ తెలిపారు.

కాగా.. సోమవారం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు దళిత బంధు అమలు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దళిత బంధును అమలు చేయాలని సీఎం కే. చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. అర్హులైన దళితులకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతి ఏటా 2 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేసేలా 20 వేల కోట్లను కేటాయిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. కొత్తగా నాలుగు మండలాల్లో దళిత బంధు అమలుపై సీఎం కేసీఆర్‌ సోమవారం సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలను గౌరవించి.. వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులకు అనుగుణంగా.. దళితబంధును విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెలంగాణ నలుదిక్కులా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు కేసీఆర్‌ వివరించారు. తూర్పు దిక్కున మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చం పేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపడుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Also Read:

CM KCR: హైదరాబాద్ మెట్రోను ఆదుకుంటాం.. భవిష్యత్తులో సేవలు మరింత విస్తరించాలి: సీఎం కేసీఆర్‌

KTR: సైదాబాద్ నిందితుడు దొరకలేదు.. ఆ ట్వీట్ పొరపాటున చేశా: మంత్రి కేటీఆర్