Telangana Holidays List 2024: వచ్చే ఏడాది సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. మొత్తం ఎన్నంటే..
ఇక అన్ని ఆదివారాలతో పాటు అన్ని నెలల్లో రెండో శనివారాలు సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే జనవరి 1వ తేదీన సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యంలో ఫిబ్రబరి నెలలో రెండో శనివారం పని దినంగా ప్రకటించారు. ఈ ఒక్క రోజు మినహా అన్ని రెండో శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆప్షనల్ హాలీడేస్‌ను ఉపయోగించుకోవడానికి...

2024 ఏడాదికిగాను సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మొత్తం 52 సెలవులను ప్రకటించగా.. వీటిలో 27 జనరల్ హాలీడేస్, 25 ఆప్షనల్ హాలీడేస్ ఉన్నాయి. 5 ఆప్షనల్ హాలీడేస్‌కు మించకుండా సెలవులు తీసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఇక అన్ని ఆదివారాలతో పాటు అన్ని నెలల్లో రెండో శనివారాలు సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే జనవరి 1వ తేదీన సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యంలో ఫిబ్రబరి నెలలో రెండో శనివారం పని దినంగా ప్రకటించారు. ఈ ఒక్క రోజు మినహా అన్ని రెండో శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆప్షనల్ హాలీడేస్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతి కోసం ముందస్తుగానే రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.
ఇక ఇదుల్ అహా, మొహరాం, ఇద్ ఇ మిలాద్ పండుగల సెలవుల తేదీలను ప్రస్తుతం ప్రకటించినప్పటికీ.. ఆ సమయానికి మార్పులు చేర్పుల ఆధారంగా సెలవు తేదీని తిరిగి ప్రకటిస్తామని, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తామని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో జారీ చేసింది.
ఇక ఈ ఏడాది ప్రధాన పండుగల విషయానికొస్తే సంక్రాంతి జనవరి 14, ఉగాది ఏప్రిల్ 9, బక్రీద్ జూన్ 17వ తేదీ, వినాయకచవితి సెప్టెంబర్ 17వ తేదీ, అక్టోబర్ 12వ తేదీ విజయదశమి, అక్టోబర్ 31 దీపావళి, డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సెలవులు ఉన్నాయి.
పూర్తి సెలవుల జాబితా ఇది..
#Telangana Holidays list 2024: TS Govt releases list of general, optional holidays #Welcome2024 pic.twitter.com/EsAvfxl5yc
— Janardhan Veluru (@JanaVeluru) December 12, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
