
తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచేస్తున్న రైతు భరోసాపై గుడ్‌న్యూస్ అందింది. ఎట్టకేలకు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది.ఈ నెల 17న రైతు భరోసా డబ్బలును విడుదల చేసింది. ఆ రోజున రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానున్నాయి. యాసంగి సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ఇప్పుడు అందించేందుకు సిద్దమయ్యారు. గతంలో విడతల వారీగా వీటిని జమ చేయగా… ఇందుకు తొమ్మిది రోజుల సమయం పట్టేది. అయితే ఇప్పుడు ఒకే విడతలో వీటిని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో రైతులు తమకు ఎప్పుడు పడతాయోనని వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అందరికీ ఒకేసారి నగుదును బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుందని తెలుస్తోంది. జనవరిలోనే ఈ నిధులను విడుదల చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగడంతో అధికారులు ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మన్సిపల్ ఎన్నికలు ముగియడయంతో రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం సిద్దమైంది.
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా జమ చేసేందుకు రూ.9 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల విడుదలకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. గత ఖరీఫ్ సీజన్‌లో 69,39,548 మంది రైతులకు రైతు భరోసా విడుదల చేశారు. ఇందుకోసం రూ.8,744.13 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. రైతు భరోసా విడుదల చేయడంలో జాప్యం జరగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్‌లోనే యాసంగి సీజన్ మొదలైనప్పటికీ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వచ్చింది. దీంతో విత్తనాలు, ఎరువులు, రసాయనాలు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసుకునేందుకు రైతుల దగ్గర డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది బ్యాంకుల నుంచి అప్పులు, మరికొంతమంది వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటికే ఇందుకు అవసరమైన నిధులను ఆర్ధికశాఖ విడుదల చేసింది.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో జరిగిన బహిరంగ సభలో రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. నిధుల సర్దుబాటు, మున్నిపల్ ఎన్నికల వేళ అధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది.