Telangana: వ్యాక్సినేషన్ తీసుకోనివారికి రేషన్ కట్.? క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

|

Oct 26, 2021 | 3:11 PM

తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనివారికి అలెర్ట్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Telangana: వ్యాక్సినేషన్ తీసుకోనివారికి రేషన్ కట్.? క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్..
Vaccination Telangana
Follow us on

తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనివారికి అలెర్ట్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ”వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపి వేస్తారన్నది” దాని సారాంశం. దీనిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ కట్ అంటూ వస్తున్న వార్తలను వైద్యారోగ్య శాఖ ఖండించింది.

సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు అవాస్తవమని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని.. ప్రజలు అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ఆందోళనకు గురికావద్దని కోరారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read:

ఈ 5 విషయాలను ఎప్పుడూ మర్చిపోవద్దు.. లేదంటే ఏ సమస్యకి పరిష్కారం దొరకదు..

మరో మహామ్మరి కలకలం.. ఆంత్రాక్స్ లక్షణాలతో గొర్రెల మృతి.. జనాలు హడల్..