Night Curfew in Telangana: తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ.. సోషల్ మీడియాలో హల్‌చల్.. ఇది నిజమేనా?

|

Apr 02, 2021 | 1:27 AM

Night Curfew in Telangana: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో అంతటా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ

Night Curfew in Telangana: తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ.. సోషల్ మీడియాలో హల్‌చల్.. ఇది నిజమేనా?
Night Curfew
Follow us on

Telangana Night Curfew: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో అంతటా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారన్న ఊహగానాలు మొదలయ్యాయి. దీనిపై ఇటీవలనే ప్రభుత్వం సైతం క్లారిటీ ఇచ్చింది. లాక్‌డౌన్, కర్ఫ్యూలాంటివి విధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ తరుణంలోనే ఏప్రిల్ 1న గురువారం లాక్‌డౌన్, కర్ఫ్యూపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు షాపులు, వ్యాపార సముదాయాలు, ప్లే జోన్లు మూసేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని.. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంతకం ఉండటంతో అంతా నిజమే అనుకున్నారు. ఈ నిబంధనలు ఈ నెల 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వార్త వైరల్ అయింది.

అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఉదంతులను ప్రజలు నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో ఎలాంటి రకమైన లాక్ డౌన్ విధించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదంటూ మరోసారి స్పష్టంచేశారు. షాపులు, వాణిజ్య సంస్థలను మూసివేయడానికి 2021 ఏప్రిల్ 1న తన సంతకంతో జారీ చేసిన జీవో పత్రం సోషల్ మీడియాలో ప్రచారం అవుతోందని ప్రభుత్వ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇదీ నకిలీదని.. ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులను జారీ చేయలేదని స్పష్టంచేశారు. ప్రజలు నమ్మవద్దంటూ సూచించారు.

Also Read:

కుక్కకు స్నానం చేయిచడానికి వెళ్లి.. గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు..

Hyderabad: దారుణ హత్య.. శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఎక్కడంటే..?