Telangana: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల(ఐఏఎస్)ను బదిలీలు, పోస్టింగులు జరిగాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీల నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థానచలనం కల్పించారు. వెయిటింగ్‌లో ఉన్న అధికారులకు కూడా పోస్టింగ్‌లు కేటాయించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరిట జారీ అయిన ఈ ఉత్తర్వుల ప్రకారం..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైస్ చైర్మన్‌గా అనితా రామచంద్రన్‌ను నియమించారు. పంచాయతీ రాజ్ కమిషనర్ గా శరత్ ను నియమించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా కృష్ణ భాస్కర్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఇక వ్యవసాయ శాఖ కార్యదర్శి & కమిషనర్ గా రఘునందన్ రావు ను నియమించారు. యూత్ సర్వీసెస్ డైరెక్టర్ గా వి. వెంకటేశ్వర్లు, మైనారిటీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా మహమ్మద్ అబ్దుల్ అజీం లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా జితేష్ వి పాటిల్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా కె నిఖిల, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, నాగర్ కర్నూల్ కలెక్టర్ గా ఉదయ్ కుమార్, జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా వెల్లూరు క్రాంతి, జనగాం కలెక్టర్గా శివలింగయ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ గా బి గోపి, మహబూబాబాద్ కలెక్టర్ గా శశాంక కు పోస్టింగ్ కేటాయించారు.
Also read:
Shocking News: హడలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. ప్రాణాలు కోల్పోయిన 30 మంది చిన్నారులు..
Supreme Court: మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు..