Telangana Government: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిపై అటు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి వయసును 61 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు అసెంబ్లీ ఇటీవలే ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 36 వేల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. కాగా, ఉద్యోగుల వయస్సు పెరిగే కొద్దీ.. వారి అనుభవం కూడా పెరుగుతుందని.. ఆ అనుభవాన్ని వినియోగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
Also Read:
చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!
మరణించాడనుకుని అంత్యక్రియలు పూర్తి.. మూడు నెలల తర్వాత తిరిగొచ్చిన చనిపోయిన వ్యక్తి.. ట్విస్ట్ ఇదే.!