Telangana: తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే సూపర్ న్యూస్.. ఉచితంగా బైక్, స్కూటీ.. ఈ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకుంటేనే..

తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీలకు అండగా నిలిచేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ వర్గాల్లోని యువత ఆర్దికంగా ఎదగాలనే ఉద్దేశంతో నూతన స్కీమ్ ప్రారంభించింది. వీరికి ఉచితంగా బైక్, స్కూటీలు అందించనుంది. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ ప్రారంభించింది. ఈ వివరాలు చూస్తే..

Telangana: తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే సూపర్ న్యూస్.. ఉచితంగా బైక్, స్కూటీ.. ఈ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకుంటేనే..
Telangana

Updated on: Jul 04, 2026 | 6:55 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్టియన్ మైనార్టీలకు ఉచితంగా బైకులు, స్కూటీలు, కుట్టు మిషన్లు అందించాలని నిర్ణయించింది. మహిళలు, యువత స్వయం ఉపాధి పొందేందుకు వీటిని ఫ్రీగా ఇవ్వనుంది. ఇందుకోసం తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వీటిని అర్హులైనవారికి పంపిణీ చేయనుంది. ఈ మేరకు మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ ప్రకటన చేశారు. ఇందుకోసం ఓబీఎంఎంఎస్ పోర్టల్ ఆయన ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా క్రిస్టియన్ మైనార్టీలు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ వర్గాల యువత చిన్న చిన్న వ్యాపారులు మొదలుపెట్టి స్వయంశక్తితో ఎదిగేందుకు ప్రభుత్వం బైక్స్, స్కూటీలు, కుట్టు మిషన్లు, మోటార్ బైక్స్, చిన్న వ్యాపార యూనిట్లను మంజూరు చేయనుంది.

ఈ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు

లబ్దిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 3వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వగా.. జులై 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం పలు విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. పట్టణాల్లో లబ్ది పొందాలనుకునేవారి కుటుంబ వార్షియ ఆదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల్లోపు ఉండాలి. కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునేవారి వయస్సు 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక బైక్, స్కూటీ కోసం దరఖాస్తు చేసుకునేవారి వయస్సు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. tsobmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.

యువత కోసం పథకం..

ఇక పూర్తి వివరాల కోసం tscmfc.in వెబ్‌సైట్‌ సందర్శించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సందేహాల కోసం 040-23391067 నంబర్‌ను సంప్రదించాలని కోరింది. అర్హులైనవారు దరఖాస్తు చేసుకుని లబ్ది పొందాలని తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి. సబిత సూచించారు. స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని తెలిపారు. యువత ఆర్దికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Follow Us