Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయి.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

సంక్రాంతి పండుగ వేళ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. ఎల్-3 జాబితాలో ఉన్నవారికి నిధులను విడుదల చేసింది. ఈ మేరకు పెండింగ్ బకాయిలను విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసినట్లు స్పష్టం చేసింది.

Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయి.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
Indiramma houses

Updated on: Jan 13, 2026 | 7:50 AM

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. లబ్దిదారుల అకౌంట్లో నిధులను విడుదల చేసింది. సంక్రాంతి వేళ లబ్దిదారులకు ఊరట కలిగిస్తూ డబ్బులు రిలీజ్ చేసింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లను నిర్మించుకున్న తర్వాత వివిధ కారణాల వల్ల చాలామందికి నిధులు ఆగిపోయాయి. ఎల్-3 కేటగిరీ కింద ఇల్లు నిర్మించుకున్నవారికి నిధులు నిలిచిపోయాయి. ఇప్పుడు వారి అకౌంట్లోకి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్ట్ పీవీ గౌతం స్పష్టం చేశారు. ఎల్-3 లబ్దిదారులకు పెండింగ్ బిల్లులను జమ చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ల నుంచి వచ్చిన రిపోర్టుల ప్రకారం 1072 లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు రిలీజ్ చేసినట్లు తెలిపారు.

పెండింగ్ బిల్లులు విడుదల

ఇటీవల పెండింగ్ బిల్లుల విడుదలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ బిల్లులను వీలైనంత త్వరగా పరిష్కరించి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు పరిశీలించి ఇప్పుడు డబ్బులు విడుదల చేశారు. కొంతమంది గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం క్రింద ప్రయోజనం పొంది ఉండటంతో పాటు ఆర్సీసీ అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నట్లు అదికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. దీంతో కొంతమంది లబ్దిదారులకు నిధులు విడుదల చేయకుండా నిలిపివేశారు. కానీ వీరికి పెండింగ్‌లో పెట్టిన నిధులు విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వానికి రిక్వెస్ట్‌లు భారీ సంఖ్యలో వచ్చాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన తర్వాత బేస్‌మెంట్ వరకు పనులు పూర్తి చేసినవారికి, ఆర్సీసీ ఇళ్లల్లో అద్దెకు ఉంటున్నవారికి నిధులు తాజాగా విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రక్రియ వేగవంతం

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు నిధుల విడుదలలో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను రేవంత్ సర్కార్ ఆదేశించింది. ఆలస్యం చేయకుండా లబ్దిదారులకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని సూచించింది. ఇంటి నిర్మాణం పూర్తయ్యే కొద్ది దశలవారీగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులను జమ చేస్తోంది. ప్రతీ వారంలో లబ్దిదారులకు నిధులు అందిస్తోంది. వెంటనే ఈ నిధులు జమ చేయాలని, అలసత్వం ప్రదర్శించవచ్చని ప్రభుత్వం సూచించింది. దీంతో లబ్దిదారుల అకౌంట్లలో ఎప్పటికప్పుడు డబ్బులు జమ అవుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో నివసిస్తున్న వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేయగా.. త్వరలో పట్టణాలు, సిటీల్లోని పేదలకు కూడా  ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది. ఏప్రిల్ నుంచి వీరికి కూడా ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఇటీవల ప్రభుత్వం తెలిపింది.