Telangana: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. పంట రుణాల మాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

|

Jun 21, 2024 | 9:53 PM

తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా సమాయత్తమవుతోంది.. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ పంటరుణాల మాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది..

Telangana: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. పంట రుణాల మాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
Revanth Reddy
Follow us on

తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా సమాయత్తమవుతోంది.. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ పంటరుణాల మాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది.. పంట రుణాల మాఫీకి శుక్రవారం కేబినెట్ ఆమోదముద్రవేసింది.. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలకు వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించింది. రుణమాఫీకి రూ.30 వేల కోట్లు, రైతు భరోసాకు రూ.7 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది.. రుణమాఫీ విధివిధినాల ఖరారు, రైతు భరోసాపై చర్చ, రైతు కార్పొరేషన్‌ ఏర్పాటు, బడ్జెట్‌ సమావేశాలతోపాటు రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపైనా కేబినెట్‌లో చర్చించారు.

కేబినెట్ భేటీ అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. రైతుభరోసాపై నలుగురు మంత్రులతో సబ్ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. ఎవరికి ఇవ్వాలనే విషయంలో రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకుంటుందన్నారు. జులై 15లోపు కమిటీ రిపోర్ట్ ఇస్తుందన్నారు. రుణమాఫీకి సంబంధించి జీవోలో పూర్తి వివరాలు ఉంటాయని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..