Telangana: రైతుబీమా అప్లికేషనల్లో మార్పులు, చేర్పులకు చాన్స్.. నేడ్ లాస్ట్ డేట్

|

Jul 20, 2022 | 7:39 AM

తెలంగాణ రైతులకు ముఖ్య గమనిక. బీమా అప్లికేషన్లలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే వాటిని అప్‌డేట్ చేసుకునేందుకు నేడే లాస్ట్ డేట్.

Telangana: రైతుబీమా అప్లికేషనల్లో మార్పులు, చేర్పులకు చాన్స్.. నేడ్ లాస్ట్ డేట్
Rythu Bheema
Follow us on

Telangana Farmers: తెలంగాణలోని రైతులకు అలెర్ట్. రైతుబంధు సమూహిక జీవిత బీమా అప్లికేషన్లలో మార్పుల కోసం సర్కార్ అవకాశం కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం రైతుబీమా పథకం అమలులో భాగంగా ప్రభుత్వం రైతుల పేరిట భారతీయ బీమా సంస్థకు ప్రిమీయం చెల్లింపులు చేస్తుంది. ఈ క్రమంలో అర్హులైన అన్నదాతలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం మరో చాన్స్ ఇచ్చింది. గతంలో రైతుబీమాలో నమోదు చేసుకున్న రైతులు తమ వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నట్లైతే సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.  నామిని చనిపోతే ఆ స్థానంలో పేరు మార్పు, రైతుతో నామిని సంబంధం ఏదైనా తప్పుగా పడి ఉంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. బీమాలో మార్పులు, చేర్పుల కోసం సంబంధిత క్లష్టర్ల వారీగా మండల వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ నెల 20న బుధవారం లాస్ట్ డేట్ కావడంతో ఈ అవకాశం రైతులు వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది. సంబంధిత దరఖాస్తు పూర్తి చేసి.. కావాల్సిన డాక్యుమెంట్స్ జత చేసి సాఫ్ట్‌వేర్‌లో సరిచేసుకోవాలని పేర్కొంది.

అన్నింటికీ ఆధార్ కార్డు ప్రామాణికం కాబట్టి.. సర్కార్ ఈ సౌలభ్యం కల్పించింది. రైతు పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టాదారు పాసు పుస్తకం నెంబర్ వంటి అన్ని వివరాలను తప్పనిసరి నమోదు చేయాల్సి ఉండటం వల్ల ఏ ఒక్క మిస్టేక్ ఉన్న సరిచేసుకోవచ్చు. రైతు కుటుంబంలో భూయజమానైన యువతి పెళ్లైన తర్వాత ఆధార్‌ కార్డులో ఇంటి పేరు మార్చుకున్నా కూడా అవి సరిచేసుకోవచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..