AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఎగిరి గంతేసే వార్త.. జీతాలపై బిగ్ అప్డేట్..

తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. ఇక నుంచి ప్రతీ నెలా ఒకటో తేదీన జీతాలు జమ చేయనుంది. ఈ మేరకు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు చాలా ఆలస్యంగా జీతాలు జమ అయ్యేవి.

Telangana: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఎగిరి గంతేసే వార్త.. జీతాలపై బిగ్ అప్డేట్..
Telangana
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jul 02, 2026 | 7:21 PM

Share

తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, గౌరవ వేతనంపై పనిచేస్తున్న ఉద్యోగులకు తొలిసారిగా ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు అందే విధానం అమల్లోకి వచ్చింది. గతంలో నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూడాల్సి వచ్చిన పరిస్థితికి ముగింపు పలుకుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యతో వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో సుమారు ఐదు లక్షల మంది ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరికి ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా, మరికొందరికి అవుట్‌సోర్సింగ్ సంస్థల ద్వారా వేతనాలు చెల్లించే విధానం కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో తరచూ ఏర్పడుతున్న జాప్యం కారణంగా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా ఒకటో తేదీకే అందరికీ వేతనాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ లక్ష్యంతో అన్ని శాఖలు ముందుగానే వేతన బిల్లులను సిద్ధం చేసి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ కూడా అవసరమైన నిధులను సమయానికి విడుదల చేయడంతో అధిక భాగం శాఖల్లో ఉద్యోగుల ఖాతాల్లో జూలై మొదటి తేదీకే జీతాలు జమయ్యాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వేతనాల పంపిణీ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగించింది. బిల్లులు అందిన శాఖలకు ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లింపులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే కొన్ని శాఖల్లో పరిపాలనా కారణాలతో బిల్లుల సమర్పణ ఆలస్యమైన నేపథ్యంలో అక్కడ వేతనాల చెల్లింపులు కూడా ఆలస్యమయ్యాయి. దీనిపై ప్రభుత్వం సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసి, ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి నెలా సమయానికి వేతనాలు అందే విధానం కొనసాగితే ఒప్పంద ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక ప్రణాళికలు సులభమవుతాయని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఉద్యోగుల్లో విశ్వాసం మరింత బలపడుతుందని వారు పేర్కొంటున్నారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!