Schools: విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. ఒంటిపూట బడులపై కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఒంటిపూట విధానం అమలు చేయాలని స్ఫష్టం చేసింది. నేటి నుంచి ఈ విధానం అమలు చేయనున్నారు. అటు ఏపీలో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు.

Schools: విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. ఒంటిపూట బడులపై కీలక ప్రకటన
Anganwadi Centre

Updated on: Mar 16, 2026 | 7:35 AM

తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం మొదలైపోయింది. ఎండలు ఇప్పటినుంచే దంచికొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ ప్రభావం క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు ఒంటి పూట బడులను నిర్వహిస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో ఒంటిపూట బడులు మొదలవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఒంటిపూట విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఎండల కారణంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఒంటిపూట విధానం అమలు చేయనున్నారు.

ఏప్రిల్ 23 వరకు..

అంగన్వాడీ కేంద్రాల్లో ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. ఏప్రిల్ 23 తర్వాతే సమ్మర్ హాలీడేస్ ప్రకటించనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటివరకు ఒంటిపూట, వేసవి సెలవుల విధానం అమల్లో లేదు. తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఈ విధానం ప్రవేశపెట్టింది. అయితే వేసవి సెలవులు ప్రకటించినా.. చిన్నారులు, గర్బిణులు అందించే పౌష్టికాహారం విషయంలో ఎలాంటి మార్పుల ఉండవు. వాటి సరఫరా నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. టేక్ హోం రేషన్ విధానంలో ఆహారం సరఫరా కొనసాగుతోందని స్పష్టం చేసింది.

సక్షమ్ అంగన్వాడీ కేంద్రాలు

ఇక తెలంగాణలోని 5 వేలకుపైగా అంగన్వాడీలను సక్షమ్ అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకోసం రూ.30 కోట్లను ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఈ సక్షమ్ అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వాటర్ ఫిల్టర్, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, పోషక భవనాలు, బల్య దశ విద్యాసామాగ్రి వంటివి అందుబాటులో ఉంటాయి. కేంద్రం మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వశాఖ మిషన్ సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాల్లో ఉన్న రెండు లక్షల అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తోంది. అటు ఏపీలో అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట విధానం ఇంకా ప్రకటించలేదు. ఏపీలో కూడా మార్చి 16వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఒంటిపూట బడులు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నేటి నుంచి మధ్యాహ్నం వరకే స్కూళ్లు ఉండనున్నాయి. ఆ తర్వాత వేసవి సెలవులు త్వరలో ప్రకటించనున్నారని తెలుస్తోంది.

Follow Us