ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో సంక్రాంతి హాలిడేస్ ఎన్ని రోజులు అనే చర్చ మొదలైంది. దీంతో అకడమిక్ క్యాలెండర్ తిరగేస్తే లెక్క తేలింది. ప్రభుత్వం విడుదల చేసిన విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారం.. 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది. ఈ తేదీల్లో సెలవులు ఉంటాయా..? లేదా ఏమైనా మార్పులు.. చేర్పులు చేస్తారా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఇక విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను బట్టి చూస్తే.. , 2025 జనవరి 10 లోపల టెన్త్ క్లాస్ సిలబస్‌ను కంప్లీట్ చేయనున్నారు. ఆపై రివిజన్ క్లాసులు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28, 2025 లోపల.. 1 నుంచి 9 తరగతుల వరకు సిలబస్ కంప్లీట్ చేస్తారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఎగ్జామ్ షెడ్యూల్‌లో వెల్లడించింది.
2025 సెలవుల లిస్ట్ విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఆప్షనల్ హాలిడేస్ జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2025 ఏడాదిలో మొత్తంగా 27 సాధారణ సెలవులు వస్తుండగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఇస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో తెలిపింది. సెలవుల జాబితాను దిగువన చూడండి…
Telangana 2025 Holidays Out
The #Telangana Government has announced its 2025 holiday list, including major festivals and optional holidays for employees. pic.twitter.com/20N2heT5Jq
— Urooj Turabi (@uroojturabi5) December 27, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..