
బెట్టింగ్ యాప్స్ కేసు తెలంగాణలో పెద్ద సమస్యగా మారింది. ఈ విషయంలోసీరియస్‌గా ఫోకస్ పెట్టిన తెలంగాణ సర్కార్…ఐదుగురు సభ్యులతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది. సీఐడీ అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగనుంది. 90 రోజుల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ ఆదేశించారు. ఈ బృందంలో ఐజీ రమేష్ రెడ్డి, ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసి….బెట్టింగ్‌ను నిరోధించే చర్యలను ప్రభుత్వానికి సూచించనుంది. బెట్టింగ్ యాప్స్ క్రికెట్, క్యాసినో గేమ్‌లను అందుబాటులోకి తెచ్చి కోట్లాది రూపాయలను దోచుకుంటున్నాయి. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో..హైదరబాద్‌లో ఇప్పటికే 25 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, 19 మంది యాప్ నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. ఈ యాప్స్ వల్ల ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలు కూడా ఇటీవల పెరిగాయి. అందుకే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.
సిట్ ముందున్న లక్ష్యాలు..తెలంగాణలో బెట్టింగ్ అన్న పేరు వినిపించకుండా చర్యలు తీసుకోవడం. ఇది ఓరకంగా సిట్‌కు సవాల్. ఇదంత సులభమైతే కాదు..అలాగని అసాధ్యమూ కాదు. సిట్ బృందం ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులను లోతుగా విచారించి, వీటి వెనుక నిర్వాహకులు, ఆర్థిక మూలాలు, సాంకేతిక వ్యవస్థలను గుర్తించాలి. ఈ యాప్స్ చైనా, దుబాయ్, హాంకాంగ్ నుంచి నడుస్తున్నట్లు సమాచారం ఉంది. ఇవి హవాలా, క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బును తరలిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఒక్క కేసులోనే 100 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిట్ ఈ డబ్బు మార్గాలను ఛేదించి, నేరస్థులను శిక్షించే ఆధారాలను సేకరించాలి. అంతేకాదు, ఈ సమస్యను శాశ్వత పరిష్కారం ఇవ్వడం సిట్ బాధ్యత.
అనేక సవాళ్లతో కూడిన దర్యాప్తు ఇప్పుడు సిట్ చేయబోతోంది. బెట్టింగ్ యాప్స్ వెనుక అంతర్జాతీయ మాఫియా నెట్‌వర్క్‌లు ఉన్నాయి, వీటిని గుర్తించడం, వాటి సర్వర్‌లను ట్రాక్ చేయడం సాంకేతికంగా కష్టం. ఈ యాప్స్ స్థానిక ఏజెంట్లు, ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా ప్రచారం చేశారు. వీరిని చట్టపరమైన ఉచ్చులో బిగించడం సులభం కాదు. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఈ దర్యాప్తును ప్రభావితం చేయవచ్చు, ఎందుకంటే కొందరు ప్రముఖులు ఈ యాప్స్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ బృందం ఈ అడ్డంకులను అధిగమించి, స్వతంత్రంగా పనిచేయాల్సి ఉంది.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..