బీజేపీకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా.. పార్టీ అధ్యక్షుడికి రాసిన లేఖలో ఏముందంటే..?
మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.
Motkupalli Narasimhulu
Follow us on
మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయన.. ఇటీవల సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత నేతల సమావేశానికి సైతం హాజరయ్యారు. పార్టీనేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మోత్కుపల్లి ప్రగతి భవన్‌కు వెళ్లటంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మోత్కుపత్తి ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోత్కుపల్లి వెల్లడించారు.
Matkupalli Narsimhulu
పార్టీ లో జరుగుతున్న పరిణామాలపై మనస్థాపానికి గురయ్యానని, దళిత ఎంపవర్మెంట్ మీటింగ్ పోతే నాపై వివాదం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈటల చేరిక విషయం లో విభేదించిన మోత్కుపల్లి.. పార్టీలో దళితుల భాగస్వాయం లేదని ఆరోపించారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడికి లేఖ రాశారు. అయితే, దళిత బంధు సమావేశం కన్నా ముందు నుండే మోత్కుపల్లి టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారన్న వార్తలు వినిపించాయి. తాజాగా మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేయటంతో ఆయన టీఆర్ఎస్‌లో చేరటం లాంఛనమే కానుంది.