Palvancha Tragedy: ఫ్యామిలీ సూసైడ్ విషయంపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..

|

Jan 06, 2022 | 3:14 PM

కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సన్‌ స్ట్రోక్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును కదిలించింది.

Palvancha Tragedy: ఫ్యామిలీ సూసైడ్ విషయంపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..
Vanama Venkateswara Rao
Follow us on

కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధిత కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేందర్ రావు కారణమన్న ఆరోపణలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి.  సన్‌ స్ట్రోక్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును కదిలించింది. తన రాజీనామాకు విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం సూసైడ్ చేసుకోవడం తనకు బాధగా ఉందన్నారు. చట్టం, న్యాయంపై నమ్మకం ఉన్న తాను… దర్యాప్తునకు అన్ని విధాల సహకరిస్తానన్నారు. తన కొడుకునూ ఇన్వెస్టిగేషన్‌కు సహకరించేలా బాధ్యత తీసుకుంటానన్నారు. కేసులో నిజా నిజాలు తేలేదాకా కొడుకు రాఘవేంద్రను పార్టీ కార్యక్రమాలకు, నియోజకవర్గ పనులకు దూరంగా ఉంచుతానని హామీ ఇచ్చారు

గమనించాల్సిన విషయం ఏంటంటే బహిరంగ లేఖ విడుదల చేసిన ఎమ్మెల్యే వనమా, ఎక్కడా కూడా తన కుమారుడు మంచివాడని సమర్థించడంగానీ , తన కుమారుడి కారణంగా ఘటన జరగలేదన్న ఖండనగానీ లేదు. వనమా ఇష్యూపైనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్‌ రియాక్ట్‌ అయ్యారు. వనమాపై ముందే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇప్పటి దాకా వచ్చి ఉండేది కాదన్నారు. రామకృష్ణ ఎపిసోడ్‌లో రాఘవేందర్‌పై ఉన్న అనుమానాలకు సాక్ష్యాలు తోడవ్వడంతో అతన్ని ఈ కేసులో A2గా చేర్చారు పోలీసులు.

పాల్వంచలో రాఘవేందర్ రావు ఎపిసోడ్ తెరపైకి రావడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాల్వంచలో కమలనాథులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజీనామాకు డిమాండ్ చేసిన బీజేపీ నేతలు.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటున్నారు.

Vanama Raghava

Also Read: అనుమానాస్పదంగా కనిపించిన పార్శిల్ బాక్స్‌లు.. తెరిచి చూసిన అధికారులు షాక్