ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ప్రతి ఒక్కరికి రూ.1.50లక్షల వరకు సబ్సిడీ! అమల్లోకి కొత్త పథకం!
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

రాష్ట్రాన్ని కాలుష్యరహింతగా మార్చేందుకు తెలంగాణ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను ఈవీలుగా మార్చేస్తుంది. ఇప్పటికే రవాణాల వ్యవస్థలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. డీజిల్ బస్సులు వినియోగాన్ని తగ్గించింది. అలాగే హైదరాబాద్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ఆటో డ్రైవర్లపై ఇంధన భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్–2026కు అనే కొత్త పథాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు జీవో కూడా జారీ చేసింది.
ఈ పథకం కింద హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో తిరిగే పెట్రోల్, డీజిల్ ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ (EV) వాహనాలుగా మార్చనుంది. అయితే ప్రస్తుతం తొలి విడతలో భాగంగా 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వం రూ.200 కోట్ల బడ్జెట్‌ను కూడా కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలోనే ఈ ప్రక్రియ మొదటు కాబోతుంది. ఒక వేళ ఈ ఆటోలు అన్ని ఈవీలుగా మారుస్తే ఆటో డ్రైవర్లకు భారీ లాభం చేకూరనుంది.
డ్రైవర్లకు రెండు ఆప్షన్స్
అయితే ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం రెండు ఆప్షన్స్‌ను ఇస్తోంది. ఒకటి పాత ఆటోను ఈవీగా మార్చడం అంటే ఉన్న పాత ఆటో ఛాసిస్‌ను అలాగే ఉంచి, పెట్రోల్/డీజిల్ ఇంజిన్ స్థానంలో AIS-123 ప్రమాణాలు కలిగిన ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చుతారు. ఇందుకోసం ఫిక్స్‌డ్ బ్యాటరీ లేదా బ్యాటరీ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక రెండో ఆప్షన్ ఏంటంటే.. మీ దగ్గర ఉన్న పాత ఆటో స్థానంలో కొత్త ఈవీ కొనుగోలు చేయడం. అంటే ఇప్పుడు డ్రైవర్లు వాడుతున్న తమ వాహనాన్ని స్క్రాప్ చేసి..
రూ.1.5లక్షల వరకు సబ్సిడీ
అయితే కొత్త ఈవీని కొనుగొలు చేయాలి. అయితే కొత్త ఆటోలు కొనేవారికి రూ.1.5లక్షల వరకు సబ్సిడీ కూడా ఇవ్వనున్నారు. ఎలక్ట్రిక్ ఆటోలకు ఈవీల మాదిరి పెట్రోల్, డీజిల్ వాడాల్సిన పని ఉండదు కాబట్టి.. వాటికి పెట్టే డబ్బులు డ్రైవర్లకు మిగులుతాయి. అంతేకాదు నగరంలో కాలుష్యం కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
