Telangana: షాకింగ్ న్యూస్.. తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ కోర్సు ఫీజులు

తెలంగాణలో తమ పిల్లలను ఇంజినీరింగ్‌లో చదివించాలనుకునే పేరెంట్స్‌కు షాకింగ్ న్యూస్. పలు కాలేజీలు ఫీజులు పెంచుకునేందుకు హైకోర్టు అనుమతిచ్చింది.

Telangana: షాకింగ్ న్యూస్.. తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ కోర్సు ఫీజులు
Engineering Colleges

Updated on: Sep 05, 2022 | 5:46 PM

Telangana engineering colleges: తెలంగాణలో ఇంజినీరింగ్‌ ఫీజులు భారీగా పెరిగిపోయాయి. ఫీజులపై గవర్నమెంట్ జీవో ఇవ్వకుండానే కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఫీజు పెంపుపై హైకోర్టును ఆశ్రయించి  అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు పొందాయి 79కాలేజీలు. TSAFRC దగ్గర అంగీకరించిన ఫీజులకు అనుమతి ఇచ్చింది హైకోర్ట్‌. వాటి ప్రకారం కొన్ని కాలేజీల్లో లక్షన్నర..36 కాలేజీల్లో లక్ష రూపాయలు దాటాయి వార్షిక ఫీజులు. సీబీఐటీలో రూ.1.73లక్షల వార్షిక ఫీజు ఉండగా.. వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళ కాలేజీల్లో రూ.1.55లక్షల వరకు వార్షిక ఫీజు ఉంది. శ్రీనిధి, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలల్లో రూ.1.50లక్షలు ఉండగా, ఎంవీఎస్ఆర్ కాలేజ్‌లొ రూ.1.45 లక్షల వార్షిక ఫీజు ఉంది.

ఐతే BC, EBCలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెంపుపై ఎటూ తేల్చలేదు ప్రభుత్వం. దీంతో పెరిగిన ఫీజుల భారం 10వేల ర్యాంక్‌ దాటిన BC, EBC విద్యార్థులపై పడనుంది. ఇక మంగళవారం మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 13 వరకు ఫీజు చెల్లింపునకు గడువిచ్చాయి యాజమాన్యాలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..