Telangana Elections: తెలంగాణలో గిఫ్ట్‌ల పంపకాలు షురూ.. పల్లె పల్లెన కానుకల జాతరే..!

Telangana Elections: తెలంగాణలో ఎన్నిలకు ముహూర్తం ఖరారు చేసింది ఎన్నికల సంఘం. దాంతో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు.. ఓటర్లకు గాలం వేయడంలో పోటీపడుతున్నారు. పండుగ కానుక ముసుగులో ఓటర్లకు తాయిలాలందిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఓటర్లకు కానుకల జాతర కొనసాగుతోంది. మహిళలకు చీరలు, ప్రెషర్‌ కుక్కర్లు, ముక్కు పుడకలు, యువతకు క్రికెట్ కిట్లు.. పల్లె పల్లెన కానుకల పంపిణీ యదేచ్ఛగా సాగుతోంది.

Telangana Elections: తెలంగాణలో గిఫ్ట్‌ల పంపకాలు షురూ.. పల్లె పల్లెన కానుకల జాతరే..!
Elections Gifts

Updated on: Oct 10, 2023 | 1:34 PM

Telangana Elections: తెలంగాణలో ఎన్నిలకు ముహూర్తం ఖరారు చేసింది ఎన్నికల సంఘం. దాంతో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు.. ఓటర్లకు గాలం వేయడంలో పోటీపడుతున్నారు. పండుగ కానుక ముసుగులో ఓటర్లకు తాయిలాలందిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఓటర్లకు కానుకల జాతర కొనసాగుతోంది. మహిళలకు చీరలు, ప్రెషర్‌ కుక్కర్లు, ముక్కు పుడకలు, యువతకు క్రికెట్ కిట్లు.. పల్లె పల్లెన కానుకల పంపిణీ యదేచ్ఛగా సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక పంపిణి చేయడం కష్టం. అందుకే బతుకమ్మ, దసరా పండుగల ముసుగులో కానుకలిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు నాయకులు.

ఆదిలాబాద్‌‌లో కాంగ్రెస్‌ నేత కంది శ్రీనివాస్ రెడ్డి తన ట్రస్ట్ ద్వారా మూడు నెలలుగా కుక్కర్ల పంపిణి చేపట్టారు. ఫిర్యాదు అందడంతో ఈసీ ఆదేశం మేరకు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 60 వేలకు పైగా కుక్కర్లు పంపిణీ చేశామని బాహటంగానే చెపుతున్నారు కంది శ్రీనివాస్. ఇక మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌ రావు యువతకు‌ క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ ఏరవెల్లి గడప గడపకు చీర సారె కార్యక్రమాన్ని చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇలా బహుమానాల జాతర కొనసాగుతోంది. కోడ్‌కు చిక్కకుండా కొందరు తమ తమ ఫౌండేషన్ల పేరిట పంపీణి కార్యక్రమాలను చేస్తున్నారు. పైకి సేవ అని చెప్తున్నా ఈ ట్రిక్కులన్నీ ఓటర్లకు గాలం వేసేందుకే అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నేతలు మరో అడుగు ముందుకు వేసి.. మందు విందు కోసం ముందస్తుగా టోకెన్లు జారీ చేస్తున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఇప్పుడే ఇలా వుంటే ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు.. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడమే ఆలస్యంగా.. యాక్షన్‌ స్టార్ చేశారు అధికారులు. తెలంగాణ సరిహద్దుల్లో విస్తృతంగా తనీఖీలు చేపడుతున్నారు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ల్లో విస్తృత తనీఖీలు కొనసాగుతున్నాయి. భైంసా సమీపంలో ఉన్న చెక్‌పోస్టుల దగ్గర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. భైంసాలో పలు దాబాలపై పోలీసుల బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. మొత్తం 6 దాబాల్లో రూ. 50 వేలకుపైగా విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. బైంసా, బోరజ్, బేల్ తరోడా చెక్ పోస్ట్ ల వద్ద ముమ్మర తనిఖీలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఎవరైనా రూల్స్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

జయశంకర్‌ భూపాలపల్లిజిల్లా కాళేశ్వరం అంతర్‌రాష్ట్ర వంతెన బోర్డర్‌ చెక్‌పోస్టును రాష్ట్ర డీజీపీ అంజన్‌కుమార్‌. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో డబ్బు, మద్యం , డ్రగ్స్‌తోపాటు నిషేధిత వస్తువులు సరఫరా కాకుండా పకడ్బందీగా భద్రత చర్యలు చేపబడుతున్నామన్నారు డీజీపీ అంజన్‌కుమార్‌.

ఖమ్మం జిల్లా వైరాలో పోలీసులు కారులో తరలిస్తున్న రూ. 5 లక్షల నగదు సీజ్‌ చేశారు. వైరా చెక్ పోస్టు వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కారులో 5 లక్షల రూపాయలు తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. ఖమ్మంలో ఎన్నిక కోడ్‌ తో ఫ్లెక్సీలను బోర్డులను తొలగించారు పోలీసులు. కొన్ని బోర్డులను బతుకమ్మ చీరాలతో కప్పారు. జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు. మరోవైపు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలోను వాహనాల తనిఖీలు చేశారు. కారులో రూ. 4 లక్షలను సీజ్ చేశారు. అటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓటర్లను ప్రలోభ పెడుతూ కుక్కర్లు పంపిణీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. 87 కుక్కర్లను సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.

నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న తెలంగాణలో దాదాపు 148 చెక్‌పోస్టులు ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ వెల్లడించింది. ఇక ఎన్నికల కోడ్‌ను అనుసరించి ఈసీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని తెలంగాణ పోలీస్‌ శాఖ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు మొదలుపెట్టింది. డబ్బు, మద్యం తరలింపుపై నిఘా పెట్టారు. రాజధాని హైదరాబాద్‌ సహా పలు జిల్లాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..