Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల సెగలు.. మోసం చేశారంటూ శాపనార్థాలు..

|

Oct 16, 2023 | 11:40 AM

Telangana Elections 2023: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ కొందరికి షాక్‌ ఇస్తే.. మరికొందరిలో జోష్‌ నింపింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 12 మంది అభ్యర్థులకు చోటు దక్కింది. కానీ.. నాగం జనార్థన్ సహా ఆయన లాంటి కొందరు మాజీ మంత్రులు, పార్టీలో సీనియర్ నాయకులకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఫలితంగా అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీకీ పలు నియోజకవర్గాల్లో నిరసన ఎదురైంది.

Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల సెగలు.. మోసం చేశారంటూ శాపనార్థాలు..
Telangana Congress Clashes
Follow us on

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ కొందరికి షాక్‌ ఇస్తే.. మరికొందరిలో జోష్‌ నింపింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 12 మంది అభ్యర్థులకు చోటు దక్కింది. కానీ.. నాగం జనార్థన్ సహా ఆయన లాంటి కొందరు మాజీ మంత్రులు, పార్టీలో సీనియర్ నాయకులకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఫలితంగా అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీకీ పలు నియోజకవర్గాల్లో నిరసన ఎదురైంది. టికెట్‌ ఆశించి భంగపడిన కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి, పీసీసీ అధ్యక్షుడిపై ఆరోపణలు చేయగా.. మరికొందరు గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు.

మేడ్చల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ పేరును ప్రకటించడంతో పార్టీ సీనియర్‌ నేత సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఇటు హైదరాబాద్‌ మల్లు రవి ప్రెస్‌మీట్‌ను మైనార్టీలు అడ్డుకున్నారు. సంబంధంలేని వారికి.. ఓల్డ్‌ సిటీ టికెట్లు కేటాయించారంటూ ముస్లిం నేతలు ఆందోళన చేపట్టారు.

ఇక ఉప్పల్‌లో రాగిడి లక్ష్మారెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్ నియంతలా వ్యవహరిస్తున్నారని, సెల్యూట్ కొట్టేవారికి టికెట్లు ఇస్తున్నారన్నారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే మొండిచెయ్యి చూపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పేంటో ఉప్పల్ చౌరస్తాలో నిరూపిస్తారా అంటూ సవాల్ చేశారు రాగిడి లక్ష్మారెడ్డి. మరోవైపు కొల్లాపూర్ టిక్కెట్‌ను కాంగ్రెస్‌ పార్టీ జూపల్లి కృష్ణారావుకు కేటాయించింది. దీంతో చింతలపల్లి జగదీశ్వర్ రావు ఆఫీస్‌లోని పార్టీ ఫ్లెక్సీలను అనుచరులు చించేశారు.

కాంగ్రెస్‌ అభ్యర్ధుల తొలి జాబితా వెలువడగానే గాంధీభవన్‌లో నిరసనలు వెలువెత్తాయి. టిక్కెట్లు దొరకని నేతలు తమ అనుచరులతో గాంధీభవన్‌లో ఆందోళనలు చేపట్టారు. దీంతో గాంధీభవన్‌కు తాళం వేశారు పార్టీ నేతలు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని గద్వాల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి వందలకోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు గద్వాల్‌ కాంగ్రెస్‌ నేత కురువ విజయ్‌కుమార్‌. మొత్తానికి ఇలా టికెట్లు ప్రకటించారో లేదో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..