Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ వీర దూకుడు.. సరికొత్త యాక్షన్ ప్లాన్‌తో సిద్ధం.. మరి వర్కౌటయ్యేనా..!

|

Sep 13, 2023 | 8:25 AM

ఆరునూరైనాసరే గెలిచి తీరాల్సిందే-అధికారం చేపట్టాల్సిందే.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌ పెట్టుకున్న టార్గెట్‌.. అందుకోసం సర్వశక్తులన్నీ ఒడ్డుతోంది కాంగ్రెస్‌ దళం. ప్రతి చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టకుండా అస్త్రంగా మలుచుకుంటోంది. ఒకవైపు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తూనే, ఇంకోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగా ఇంటింటికీ గ్యారెంటీ కార్డులు పంచబోతోంది. అదే టైమ్‌లో కలిసొచ్చిన అవకాశాన్ని..

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ వీర దూకుడు.. సరికొత్త యాక్షన్ ప్లాన్‌తో సిద్ధం.. మరి వర్కౌటయ్యేనా..!
Telangana Congress
Follow us on

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్‌ వీర దూకుడు ప్రదర్శిస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా స్పీడ్‌ పెంచి దూసుకుపోతోంది. ఏదిఏమైనాసరే, ఈసారి కొట్టి తీరాల్సిందే! అన్న కసితో ముందుకెళ్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. అధికార బీఆర్‌ఎస్‌కి దీటుగా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధంచేశారు. ఇంతకీ అదేంటి?. తెలంగాణ కాంగ్రెస్‌ ఏం చేయబోతోంది. ఈ కథనంలో తెలుసుకుందాం..

ఆరునూరైనాసరే గెలిచి తీరాల్సిందే-అధికారం చేపట్టాల్సిందే.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌ పెట్టుకున్న టార్గెట్‌.. అందుకోసం సర్వశక్తులన్నీ ఒడ్డుతోంది కాంగ్రెస్‌ దళం. ప్రతి చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టకుండా అస్త్రంగా మలుచుకుంటోంది. ఒకవైపు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తూనే, ఇంకోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగా ఇంటింటికీ గ్యారెంటీ కార్డులు పంచబోతోంది. అదే టైమ్‌లో కలిసొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమైంది టీపీసీసీ. హైదరాబాద్‌ వేదికగా ఈనెల 15, 16, 17 తేదీల్లో జరగబోతోన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాల్లో ఎన్నికల శంఖారావం పూరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అందుకు సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ను బయటపెట్టారు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క. సిడబ్ల్యూసీ వేదికగా టీకాంగ్రెస్‌ ఏమేం చేయబోతోందో చెప్పుకొచ్చారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఛార్జిషీట్లు విడుదల చేయబోతోంది టీకాంగ్రెస్‌. ఈనెల పదిహేను తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో ఛార్జిషీట్లు రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలపైనే మెయిన్‌గా ఫోకస్‌ చేయబోతోంది. ఇక, సీడబ్ల్యూసీ సమావేశాల చివరి రోజు భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది కాంగ్రెస్‌. ఈ వేదికపై నుంచి చారిత్రాత్మక నిర్ణయాలను ప్రకటించబోతున్నట్టు చెప్పారు భట్టివిక్రమార్క. అదే టైమ్‌లో టీకాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ కూడా హామీలపై విస్తృత చర్చలు జరుపుతోంది. ఎలాంటి హామీలు ఇవ్వాలి. సాధ్యాసాధ్యాలపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటోంది. హామీ ఇచ్చామంటే అమలుచేసేవిధంగా ఉండాలన్నరీతిలో మేనిఫెస్టోను రూపొందిస్తోంది. అయితే, ఈనెల 17న జరగబోయే బహిరంగసభలో ఐదు ముఖ్యమైన గ్యారంటీలపై కీలక ప్రకటన చేయబోతోంది కాంగ్రెస్‌. మొత్తానికి, అధికారమే లక్ష్యంగా మునుపెన్నడూలేని వీర స్పీడ్‌ చూపిస్తోంది. మరి, కాంగ్రెస్‌ వ్యూహాలు ఫలిస్తాయో.. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందో లేదో కొన్ని నెలల్లోనే తేలిపోనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..