Telangana Congress: కామ్రేడ్ల కోటాపై సస్పెన్స్‌..! ఏ క్షణమైనా కాంగ్రెస్‌ రెండో జాబితా.. వారి పేర్లు ఉంటాయా..?

Congress - CPI- CPM: కమింగ్ సూన్.. తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ సెకెండ్ లిస్ట్ పై కసరత్తులు చేస్తోంది.. ఏ క్షణమైనా కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా వచ్చే చాన్సుంది. ఢిల్లీలో చర్చలు భీకరంగా కొనసాగుతున్నాయి. బీ అలర్ట్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో మురళీధరన్‌ సమావేశమయ్యారు.

Telangana Congress: కామ్రేడ్ల కోటాపై సస్పెన్స్‌..! ఏ క్షణమైనా కాంగ్రెస్‌ రెండో జాబితా.. వారి పేర్లు ఉంటాయా..?
CPI Congress CPM

Updated on: Oct 21, 2023 | 6:08 PM

Congress – CPI- CPM: కమింగ్ సూన్.. తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ సెకెండ్ లిస్ట్ పై కసరత్తులు చేస్తోంది.. ఏ క్షణమైనా కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా వచ్చే చాన్సుంది. ఢిల్లీలో చర్చలు భీకరంగా కొనసాగుతున్నాయి. బీ అలర్ట్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో మురళీధరన్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఠాక్రే, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క హాజరయ్యారు. రెండో విడత అభ్యర్థుల జాబితాపై హాట్‌ హాట్‌ గా చర్చలు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా రెండో జాబితా విడుదల అవుతుందని.. మురళీధరన్‌ చెప్పడంతో కాంగ్రెస్‌ ఆశావహులు, శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. సెకండ్ లిస్టులో 64 మంది పేర్లూ ఉంటాయా? లేక మూడో లిస్టు కూడా ఉంటుందా..? అనేది తెలాల్సి ఉంది. అయితే, ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది. కామ్రెడ్లతో పొత్తుగురించి పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

సీపీఐ, సీపీఎంతో సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఫైనల్ కాలేదంటూ మురళీ ధరన్‌ చెప్పారు. ఈ క్రమంలో కామ్రెడ్లకు ఎన్ని సీట్లు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఐదేసి సీట్ల చొప్పున సీపీఐ, సీపీఎం ప్రతిపాదనలు పెడితే.. రెండేసి చొప్పున ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇవ్వాలని నిర్ణయించడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. దీనిపై మరింత క్లారిటీ రావాలని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

చెన్నూరు సీటును సీపీఐకి ఇవ్వొద్దంటూ స్థానిక కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తుంటే.. అటు వైరాలో దాదాపుగా సేమ్‌ సీన్‌ కొనసాగుతోంది. పొత్తులో భాగంగా తమ సీటును సీపీఎంకు ఇవ్వొద్దంటూ ఆందోళనకు దిగారు కాంగ్రెస్‌ నేతలు. గెలిచే సీట్లను కమ్యూనిస్టులకు ఇవ్వొద్దంటూ సూచిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చెయ్యబోయే సెకండ్ లిస్టు ఎలా ఉండబోతోంది.. పొత్తు లెక్కల్ని, అసమ్మతుల్ని ఎలా హ్యాండిల్ చెయ్యబోతున్నారు.. మిగతా 64 సీట్లూ సెకండ్ లిస్టులో రాబోతున్నాయా.. లేక థర్డ్ లిస్ట్ అంటూ ఇంకోటి ఉండబోతోందా..అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇదిలాఉంటే.. మేనిఫెస్టో విడుదలకు కూడా ముహూర్తం ఫిక్సయినట్టుంది. తామిచ్చే ప్రామిస్‌లు బీఆర్‌ఎస్, బీజేపీలకు దీటుగా ఉంటాయంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..