Kishan Reddy: కేసీఆర్‌ కామారెడ్డి, గజ్వేల్‌లోనూ ఓడిపోతారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Telangana Election: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార పర్వంలో దూసుకెళ్తూనే అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తోంది. ఈ తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ కామారెడ్డిలోనూ, గజ్వేల్‌లోనూ ఓటమి పాలవుతారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Kishan Reddy: కేసీఆర్‌ కామారెడ్డి, గజ్వేల్‌లోనూ ఓడిపోతారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Kishan Reddy

Updated on: Nov 05, 2023 | 12:44 PM

Telangana Election: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార పర్వంలో దూసుకెళ్తూనే అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తోంది. ఈ తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ కామారెడ్డిలోనూ, గజ్వేల్‌లోనూ ఓటమి పాలవుతారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. డబ్బుతో అభ్యర్థులు, నాయకులను కొనవచ్చు కాని, ప్రజల కోపాన్ని తగ్గించలేరని తెలిపారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌లో పాల్గొన్న కిషన్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితమే తెలంగాణవ్యాప్తంగా రాబోతోందని కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ యువత సునామిలా విజృంభించి బీఆర్‌ఎస్‌ను తుడిచిపెడుతుందని ప్రకటించారు. ప్రజా ఆందోళనలను అణిచివేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులను కలిసే వీలు లేకుండా పోయిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని.. కేసీఆర్ మాట తప్పారని.. ఉద్యోగ నియామకాల్లో విఫలమయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ రోడ్ల గురించి మాట్లాడుతున్నారని.. కేంద్రం నిధులివ్వకుంటే రోడ్లు ఎక్కడికి అంటూ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం కీలకంగా వ్యవహరించిందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పై కూడా కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తోందని కిషన్‌ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో వచ్చే వ్యతిరేకత కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఐదు నెలల్లోనే వచ్చిందని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు డబ్బు పంపించేందుకు కర్నాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు.

కిషన్ రెడ్డి లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..