Telangana Election: నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు.. బండి, గంగుల సవాల్, ప్రతి‌సవాల్‌తో పొలిటికల్ హీట్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ దగ్గర పడిన కొద్దీ, ప్రచార తీవ్రత కుడా అదే స్థాయిలో పెరిగింది. ఒక ప్రచార అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి దాని చుట్టే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గంగుల నీవే అవినీతిపరుడు అంటూ బండి‌ అంటుంటే, కాదు కాదు నీవే అవినీతి పరుడువి అంటూ గంగుల అరోపిస్తున్నారు. ఈ ఇద్దరూ నేతల ప్రచార అస్త్రం అవినీతే..!

Telangana Election: నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు.. బండి, గంగుల సవాల్, ప్రతి‌సవాల్‌తో పొలిటికల్ హీట్
Bandi Sanjay Kumar, Gangula Kamalakar

Edited By:

Updated on: Nov 26, 2023 | 4:41 PM

తెలంగాణ ఎన్నికల పోలింగ్ దగ్గర పడిన కొద్దీ, ప్రచార తీవ్రత కుడా అదే స్థాయిలో పెరిగింది. ఒక ప్రచార అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి దాని చుట్టే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గంగుల నీవే అవినీతిపరుడు అంటూ బండి‌ అంటుంటే, కాదు కాదు నీవే అవినీతి పరుడువి అంటూ గంగుల అరోపిస్తున్నారు. ఈ ఇద్దరూ నేతల ప్రచార అస్త్రం అవినీతే..!

కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో బిఅర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, బీజేపీ ‌అభ్యర్థి‌ బండి‌ సంజయ్ మాటలు తూటల్లాగా పేలుతున్నాయి. అభివృద్ధి అనే అంశం పక్కకెళ్ళి వ్యక్తిగత అరోపణల వరకు వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. గంగుల వ్యాపారం అక్రమం భూకబ్జా దారుడు ప్రతి పనిలో‌ కమిషన్ అంటూ బండి సంజయ్ టార్గెట్ చేస్తున్నారు. బండి‌సంజయ్ ‌అక్రమ‌ ఆస్తుల చిట్టా తన దగ్గర ఉందని గంగుల విరుచుకుపడుతున్నారు. ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే బండి‌ సంజయ్ తన పంథాని‌ మార్చుకున్నారు. ప్రతి ఎన్నికల సమావేశంలో గంగుల అవినీతి పరుడంటే అవినీతి పరుడు అంటూ విమర్శలు చేస్తున్నారు.

మంత్రి గంగుల కమలాకర్, బండి‌ సంజయ్‌పై అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. తాను చాలా ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నానని, సక్రమ సంపదనే తన దగ్గర ‌ఉందని చెబుతున్నారు. ఎలాంటి వ్యాపారాలు‌ లేని బండి‌ సంజయ్‌కి‌ కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని‌ టార్గెట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యే టికెట్లు ‌ఇప్పిస్తానని కోట్ల రూపాయలు దండుకున్నారని‌, అందు కోసమే రాష్ట్ర అధ్యక్ష పదవి తొలగించారంటూ ఘాటైనా విమర్శలు చేస్తున్నారు. ఇతని అవినీతి‌ గూర్చి మోదీ,అమిత్ కి‌ ఫిర్యాదు చేశారంటూ పలు‌ సమావేశాలలో గంగుల ఆరోపిస్తున్నారు. ఈ ఇద్దరి నేతల అవినీతి‌ అరోపణలతో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఒక్క అడుగు ముందుకు వేసి‌ ఈ. ఇద్దరూ నేతలు బహిరంగ చర్చకి‌ సై‌ అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…