
తెలంగాణలోని విద్యావ్యవస్థపై రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విద్యావ్యస్థలో సమూల మార్పులు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో +2 అనే విధానం అమలవుతుందని.. దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే అదే విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. ఇకపై రాష్ట్రంలో పదో తరగది బోర్డు పరీక్షలు ఉండబోవని.. నేరుగా ఇంటర్మీడియట్‌లోనే బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ విధానం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా సీఎం రేవంత్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక ప్రాసెస్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో ఈ కేసుపై స్పందించారు. ఈ కేసులో విచారణ జరగకుండా ఎవరినీ అరెస్ట్ చేయలేం కదా అన్నారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చిందన్నారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌ను సస్పెండ్ చేశామని తెలిపారు. ప్రభాకర్‌రావు స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నామని.. ఫోన్ ట్యాపింగ్‌లో కోర్టు క్లిన్‌చిట్ ఇచ్చిందని అసత్య ప్రచారం చేసుకుంటున్నారన్నారని అన్నారు.
కేబినెట్ విస్తరణపై కామెంట్స్
అలాగే కేబినెట్ విస్తరణపై కూడా సీఎం మాట్లాడారు. కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు తగదన్నారు సీఎం రేవంత్. ఢిల్లీ పోయిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ కోసం కాదన్నారు. అజారుద్దీన్‌కి MLC ఇవ్వడానికి సమయం ఉందని తెలిపారు. గవర్నర్ దగ్గర తేల్చుకోమని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. డిప్యూటీ స్పీకర్ విషయంలో సరైన సమయంలో నిర్ణయం ఉంటుందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.