Singareni Workers: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌.. ఒక్కొక్కరికి ఎంతో తెలుసా..?

Singareni Workers: పండగకు ముందు సింగరేణి కార్మికులకు శుభవార్త.. అయితే ఇప్పటికే దసరా బోనస్‌తో సంతోషంలో ఉన్న కార్మికులకు యాజమాన్యం దీపావళికి మరో శుభవార్త అందించింది. దీపావళి సందర్భంగా భారీ మొత్తంలో బోనస్ చెల్లించనుంది. నవంబర్ 5వ తేదీన అర్హులైన కార్మికుల..

Singareni Workers: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌.. ఒక్కొక్కరికి ఎంతో తెలుసా..?
Singareni Workers

Updated on: Oct 30, 2026 | 6:51 PM

Singareni Workers: పండగకు ముందు సింగరేణి కార్మికులకు శుభవార్త.. అయితే ఇప్పటికే దసరా బోనస్‌తో సంతోషంలో ఉన్న కార్మికులకు యాజమాన్యం దీపావళికి మరో శుభవార్త అందించింది. దీపావళి సందర్భంగా భారీ మొత్తంలో బోనస్ చెల్లించనుంది. నవంబర్ 5వ తేదీన అర్హులైన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈసారి దీపావళి బోనస్ కోసం ఏకంగా రూ.419 కోట్లను కేటాయించారు. సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 38 వేల మంది కార్మికులకు ఈ బెనిఫిట్స్‌ అందనుంది. అర్హత ఉన్న ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.1,10,250 వరకు అందనుంది.

తెలంగాణ డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ చెల్లింపులు చేపడుతున్నట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. అయితే ఈ బోనస్‌ ప్రయోజనాలు అందరికి వర్తించవు. నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (NCWA) పరిధిలోని కార్మికులకు మాత్రమే బోనస్ అందించనున్నారు. అధికారులకు ఈ బోనస్‌ వర్తించని స్పష్టం చేశారు.

వీరికి మాత్రమే బోనస్ :

అర్హత విషయంలోనూ కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. కనీసం 30 రోజుల పాటు విధులు నిర్వహించిన కార్మికులకే ఈ బోనస్‌కు అర్హులు. ఉద్యోగి పనిచేసిన రోజులను పరిగణనలోకి తీసుకుని చెల్లింపు మొత్తాన్ని నిర్ణయిస్తారు. పూర్తి అర్హత ఉన్నవారికి ప్రకటించిన గరిష్ఠ మొత్తం లభిస్తుంది.

ఇక దసరా, దీపావళి బోనస్‌లను కలిపి చూస్తే సింగరేణి కార్మికులకు నెల రోజుల వ్యవధిలోనే భారీ మొత్తంలో ఉంటుంది. రెండు చెల్లింపుల ద్వారా ఒక్కో కార్మికుడికి సగటున రూ.2.65 లక్షల వరకు అందే అవకాశం ఉంది. ఈ రెండు బోనస్‌ల కోసం సంస్థ మొత్తం సుమారు రూ.1,020 కోట్లను వెచ్చించనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us