Third Wave: కరోనా థర్డ్ వేవ్‌ వార్నింగ్స్.. తెలంగాణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఫిబ్రవరిలో కేసులు పీక్స్‌కు వెళ్తాయన్న డీహెచ్‌

|

Dec 06, 2021 | 8:20 AM

ఒమిక్రాన్.. ఇదే ఇప్పుడు థర్డ్‌ వేవ్ టెన్షన్‌కి కారణం. డెల్టా వేరియంట్ కంటే ఆరేడు రెట్లు వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ ప్రపంచానికి దడ పుట్టిస్తోంది. ఇప్పటికే..

Third Wave: కరోనా థర్డ్ వేవ్‌ వార్నింగ్స్.. తెలంగాణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఫిబ్రవరిలో కేసులు పీక్స్‌కు వెళ్తాయన్న డీహెచ్‌
Third Wave
Follow us on

థర్డ్ వేవ్ వచ్చేస్తోంది. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు. భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌ వార్నింగ్స్ మొదలైపోయాయ్. అప్రమత్తంగా లేకపోతే మరోసారి మారణహోమం ఖాయంగా కనిపిస్తోంది. జనవరిలో మొదలై.. ఫిబ్రవరిలో పీక్‌కి చేరుతుందన్న అంచనాలు ఇప్పుడు దడ పుటిస్తున్నాయి. ఒమిక్రాన్.. ఇదే ఇప్పుడు థర్డ్‌ వేవ్ టెన్షన్‌కి కారణం. డెల్టా వేరియంట్ కంటే ఆరేడు రెట్లు వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ ప్రపంచానికి దడ పుట్టిస్తోంది. ఇప్పటికే 35 దేశాల్లో అలజడి సృష్టిస్తోన్న ఒమిక్రాన్.. భారత్‌లోనూ కలవరం కలిగిస్తోంది. ఇండియాలో ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరగడం టెన్షన్ పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 21 ఒమిక్రాన్ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

భారత్‌లో ఒమిక్రాన్ కేసులు 21కి పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే 17 కొత్త కేసులు నమోదయ్యాయ్. ఇప్పటివరకు రాజస్థాన్‌లో అత్యధికంగా 9 కేసులు, మహారాష్ట్రలో 8, కర్నాటకలో 2, ఢిల్లీలో 1, గుజరాత్‌లో 1 నమోదయ్యాయి.

తెలంగాణలోనూ కరోనా కేసులు మళ్లీ దడ పుట్టిస్తున్నాయి. రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు, ఒమిక్రాన్ కంగారు పెట్టిస్తోంది. 11 ఆఫ్రికన్ దేశాల నుంచి హైదరాబాద్‌కి 979మంది వస్తే, అందులో 13మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అయితే, ఇది ఒమిక్రాన్ వేరియంటో కాదో ఈరోజోరేపో తేలనుంది.

ఏ క్షణమైనా హైదరాబాద్‌కి ఒమిక్రాన్ వేరియంట్ రావొచ్చన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నందున… తెలంగాణలోనూ నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ ఆరేడు రెట్లు వేగంగా ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Health Benefits: అయ్యో..! నలుపు అని ఫీల్ అవుతున్నారా.. ఇందులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగున్నాయి..

Omicron Tension: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 41 దేశాలకు పాకిన కొత్త వేరియంట్‌..!