
పిల్లి గుడ్డిదైతే ఎలుక ఇల్లు పీకి పందిరేస్తుందన్నట్లుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వైద్యుల నిర్వాహకం. ఏకంగా ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ హాల్‌లో జన్మదిన వేడుకలు నిర్వహించి రోగులు నివ్వెరపోయేలా చేశారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల పనితీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉంది. రోజుకు 300ల మందికి పైగా వచ్చే తొర్రూరు ప్రభుత్వ దవాఖానలో పేషెంట్ల సేవ మరిచిన సిబ్బందంతా డాక్టర్ సాబ్ మెప్పుకోసం సారు వారి గానా బజానాలో మునిగి పోయారు.
తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం రోగులతో రద్దీగా ఉంటుంది. ఇదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ Dr మురళీధర్ రావు పుట్టినరోజు శనివారంసారు పై స్వామిభక్తిని చాటుకున్న సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రిలో సౌండ్ బాక్సులు పెట్టి అరుస్తూ సంబరాలు జరుపడం చర్చనేయంశంగా మారింది..
డ్యూటీ అవర్స్‌లో ఆపరేషన్ థియేటర్ హాల్‌లో ఈ వేడుకలు నిర్వహించారు వైద్య సిబ్బంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వేడుకలు జరిగాయి. డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం మురళీధర్ పుట్టినరోజు. దీంతో ఆసుపత్రిలో సౌండ్ బాక్స్ లు పెట్టి బిర్యానీ వండించి అందరికీ విందు భోజనాలు పెట్టి సంబరాలు చేసుకున్నారు. రోగుల సేవలు పక్కన పెట్టి బిర్యానీతో ఆస్పత్రిలో విందు వినోద కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి మొత్తం దద్దరిల్లేలా సౌండ్ బాక్సులు పెట్టి ఇస్ ద లెజెండ్ అనే నినాదంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ కు జన్మదిన శుభాకాంక్షలు సిబ్బంది తెలిపడం విమర్శలకు దారితీసింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇదే..
ఇలాంటి విందు వినోద కార్యక్రమాలపై ఉన్న శ్రద్ధ ఆసుపత్రికి వచ్చే రోగులపై చూపితే బాగుంటుందని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వేడుకలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…